HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Does Youthfulness Begin To Decline After Age 35

35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!

చివరిగా.. వృద్ధాప్యం అనేది 35 ఏళ్ల నుండే మొదలవుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ పరిశోధన వివరాలు 'జర్నల్ ఆఫ్ కాచెక్సియా, సార్కోపెనియా అండ్ మజిల్'లో ప్రచురితమయ్యాయి.

  • Author : Gopi Date : 27-12-2025 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youthfulness
Youthfulness

Youthfulness: శారీరక సామర్థ్యం, కండరాల బలం సుమారు 35 ఏళ్ల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత నుండి శరీర పనితీరు క్రమంగా క్షీణించడం మొదలవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే వ్యాయామం ద్వారా ఈ క్షీణత వేగాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

మనిషి ఆరోగ్యం, శారీరక ధృడత్వానికి సంబంధించి స్వీడన్‌లోని ప్రఖ్యాత ‘కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్’ ఒక సంచలన అధ్యయనాన్ని నిర్వహించింది. ‘స్వీడిష్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిట్‌నెస్ స్టడీ’ పేరుతో చేపట్టిన ఈ పరిశోధనలో వందలాది మంది పురుషులు, మహిళల ఆరోగ్యాన్ని ఏకంగా 47 ఏళ్ల పాటు నిరంతరం పర్యవేక్షించారు. 16 నుండి 63 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులపై జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

35వ సంవ‌త్స‌రం ఎందుకు కీలకం?

పరిశోధన వివరాల ప్రకారం.. మానవ శరీరంలోని కండరాల బలం, సహనశక్తి, శారీరక సామర్థ్యం సరిగ్గా 35 ఏళ్ల వయస్సులో పీక్ స్టేజ్‌కు చేరుకుంటాయి. ఈ వయస్సును ఒక ‘టర్నింగ్ పాయింట్’గా పరిశోధకులు అభివర్ణించారు. 35 ఏళ్లు దాటిన తర్వాత మీరు ఎంత వ్యాయామం చేసినా సరే, శరీర పనితీరులో సహజంగానే కొంత మేర పతనం మొదలవుతుంది.

Also Read: టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

క్షీణత ప్రక్రియ ఎలా ఉంటుంది?

ప్రారంభ దశ: మొదట్లో ఈ క్షీణత చాలా నెమ్మదిగా అంటే ఏడాదికి కేవలం 0.3 నుండి 0.6 శాతం వరకు మాత్రమే ఉంటుంది.

ముదిరిన వయస్సు: వయస్సు పెరిగే కొద్దీ ఈ తగ్గుదల వేగం పెరుగుతుంది. ఇది ఏడాదికి 2.0 నుండి 2.5 శాతానికి చేరుకోవచ్చని అధ్యయనం హెచ్చరించింది. ఈ మార్పులు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సమానంగా కనిపిస్తాయి.

వ్యాయామమే ఏకైక రక్షణ

శరీర సామర్థ్యం తగ్గడాన్ని మనం పూర్తిగా ఆపలేము కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆ ప్రక్రియను గణనీయంగా ఆలస్యం చేయవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. వ్యాయామం ప్రారంభించడం వల్ల శారీరక సామర్థ్యం 5 నుండి 10 శాతం వరకు మెరుగుపడుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను సవాలు చేయవచ్చు. ఫిట్‌నెస్ సాధన మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.

చివరిగా.. వృద్ధాప్యం అనేది 35 ఏళ్ల నుండే మొదలవుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ కాచెక్సియా, సార్కోపెనియా అండ్ మజిల్’లో ప్రచురితమయ్యాయి. కాబట్టి 35 దాటిన వారు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనివార్యమని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health News
  • Health Tips Telugu
  • lifestyle
  • SPAF
  • study report
  • Youthfulness

Related News

The impact of depression is greater in women.

Depression in Women: డిప్రెషన్ ప్రభావం మహిళల్లోనే ఎక్కువ

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. డిప్రెషన్‌ను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది ఒత్తిడిని ‘లైట్’ తీసుకుంటున్నారు, కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువే. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది. సర్వేలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్‌లో నిర్వహించిన అధ్యయనంలో ఈ

    Latest News

    • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd