Yawning : మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే మీకు వచ్చే ప్రమాదం ఇదే !
Yawning : మీరు తరచుగా ఆవలింతలు (Yawning) వస్తే, అదే సమయంలో ఛాతీ నొప్పి, గుండె దడ, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది
- By Sudheer Published Date - 06:45 AM, Tue - 25 March 25

ఆవలింతలు (Yawning) మన శరీరంలో సహజమైన ప్రక్రియ. సాధారణంగా నిద్రలేమి, అలసట, బోరు అనుభూతి వంటి కారణాల వల్ల ఇవి వస్తాయి. మెదడు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించేందుకు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు కూడా ఆవలింతలు సహాయపడతాయి. అంతేకాదు ఇతరులు ఆవలింత వేయడం చూసినప్పుడు మనకూ ఆవలింతలు రావడం మన మెదడు సామాజిక అనుభూతిని, సానుభూతిని వ్యక్తం చేసే విధంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే సాధారణంగా వచ్చే ఆవలింతలు హానికరమైనవి కావు, కానీ విపరీతంగా తరచుగా వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
HCA : టీసీఏ పేరిట గురువారెడ్డి ప్రకటనలతో గందరగోళానికి గురికావొద్దు : హెచ్‌సీఏ
కొన్నిసార్లు అధికంగా ఆవలింతలు (Yawning) రావడం ఆరోగ్య సమస్యలకు సంకేతమవుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో మెదడుకు తగినంత రక్తప్రవాహం అందకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మూర్ఛ, మెదడు సంబంధిత వ్యాధులు, నాడీ వ్యవస్థలో మార్పులు, మెదడులో కణితులు వంటి పరిస్థితులు అధిక ఆవలింతలకు కారణంగా మారవచ్చు. అలాగే కొన్ని మందులు, ముఖ్యంగా యాంటిడిప్రెసెంట్స్, యాంటిహిస్టామిన్స్, నొప్పి నివారణ మందులు అధికంగా ఆవలింతలు తెప్పించగలవు. కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం అవసరం.
Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
మీరు తరచుగా ఆవలింతలు (Yawning) వస్తే, అదే సమయంలో ఛాతీ నొప్పి, గుండె దడ, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సాధారణంగా అవలింతలు హానికరమైనవి కాకపోయినా, అవి ఆరోగ్య సమస్యలకు సంకేతంగా మారే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, తగినంత నిద్ర తీసుకోవడం, శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవడం ద్వారా ఆవలింతలు అధికంగా రావడం తగ్గించుకోవచ్చు.