Sleep: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
రోజుకి 7 గంటలకంటే తక్కువగా నిద్రపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 29 December 24

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి విశ్రాంతి లేకపోతే అది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామంది ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి కారణంగా సరిగా నిద్రలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇంకొందరు స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రి దాటినా ఇంకా మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇలా రాత్రి సమయంలో కేవలం 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ముఖ్యంగా మెదడు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి రోజులో ఏడు గంటల కంటే ఎక్కువ తక్కువగా నిద్రపోతే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. అయితే చాలామందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరం అలసిపోతుంది. రోజుకు సరిపడా నిద్ర పోకపోతే అది మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందట.
ప్రతి వయస్సులో ఒకేలా నిద్ర గంటలు ఉండవు. పొత్తిళ్లలోని శిశువు 24 గంటలలో 14 గంటలు నిద్రపోతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ నిద్ర సమయం కూడా తగ్గుతుంది. కొంత మంది యువకులు 10-12 గంటలు నిద్రపోతారు.
వయసు పెరిగే కొద్దీ నిద్ర గంటలు తగ్గుతూ ఉండాలి. యుక్త వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. లేదంటే మెదడు దెబ్బతింటుందట. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మెదడు న్యూరాన్లు నెమ్మదిగా చనిపోతాయట. రోజంతా పని చేయడం వల్ల ఒత్తడి మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్ర మరుసటి రోజుకు మెదడును రీసెట్ చేస్తుంది. అయితే సరిగ్గా నిద్రపోకపోతే షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా 60 నుంచి 70 ఏళ్లలో వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.