Orange Benefits : చలికాలంలో నారింజ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
చలికాలంలో దొరికే ఈ నారింజ పండ్లను (Orange Fruits) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి (Health) చాలా మంచిది అంటున్నారు వైద్యులు (Doctors).
- By Naresh Kumar Published Date - 07:40 PM, Mon - 25 December 23

Benefits of Eating Orange Fruits in Winter : మామూలుగా మనకు ఒక్కొక్క సీజన్ లో ఒక్కో రకమైన పండ్లు లభిస్తూ ఉంటాయి. అలా శీతాకాలంలో కూడా మనకు అనేక రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో నారింజ పండ్లు (Orange) కూడా ఒకటి. అయితే చలికాలంలో దొరికే ఈ నారింజ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్యులు. మరి చలికాలంలో నారింజ పండ్లు (Orange) తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది ఎంతో అవసరం. కాగా నారింజలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది గుండెకి చాలా మంచిది. పొటాషియం రక్తపోటుని నియంత్రించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోకి కొలెస్ట్రాల్ శోషణని స్థాయిలని తగ్గిస్తాయి. ఆరెంజెస్‌లో ఎక్కువగా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. ఇది మీ చర్మాన్ని దృఢంగా, సాగేలా ఉంచడంలో సాయపడుతుంది. ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది. గాయాల్ని తగ్గేలా చేస్తుంది. నారింజ మంచి సిట్రస్ ఫ్రూట్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
మీరు కొలెస్ట్రాల్ వ్యాధితో బాధపడుతుంటే మీరు నారింజ తినాలి. నారింజ పండ్లను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ బరువు తగ్గించుకోవాలనుకుంటే ఆరెంజ్ గ్రేట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అదనపు కేలరీలు తీసుకోకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో ఎక్కువ కృత్రిమ చక్కెరలు లేకుండా నారింజలోని సహజ చక్కెరలు కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తాయి. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇందులో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది.
ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి నారింజని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై ప్రమాదకరమైన ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా, కిడ్నీ సమస్యలు రావవచ్చు. ఇప్పటికే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో కిడ్నీలకు హాని కలిగించే పొటాషియం ఉంటుంది. పుల్లని పండ్లు తింటే చాలా మందికి అలర్జీ సమస్యలు వస్తాయి. అలర్జీ ఉన్నవారు నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు తింటే అలర్జీ పెరుగుతుంది.
Also Read: Christmas Dinner : క్రిస్మస్ విందు..700 మందిని హాస్పటల్ పాలయ్యేలా చేసింది