HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know About Bitter Almonds

Bitter Almonds: చేదు బాదం పప్పులు గురించి మీకు తెలుసా?

  • Author : Maheswara Rao Nadella Date : 21-02-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do You Know About Bitter Almonds
Do You Know About Bitter Almonds

ప్రతిరోజు కొన్ని బాదంపప్పు (Almonds) తింటే శరీరానికి సరైన పోషణ అందుతుంది. శక్తిని ఇవ్వడంతో పాటు మెదడుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నానబెట్టిన బాదంపప్పులు తింటే చాలా మంచిది. తియ్యగా ఉండటంతో ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మీరు ఎప్పుడైనా చేదు బాదంపప్పులు (Bitter Almonds) తిన్నారా? అవును బాదం తీపి, కాస్త వగరు రుచిని కలిగి ఉంటాయి. కానీ చేదు బాదం (Bitter Almonds) మాత్రం ఘాటైన రుచిగా ఉంటాయి. అయితే చేదుగా ఉన్న బాదం పప్పు తినొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు.

పోషకాలు ఉన్నప్పటికీ..

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫాస్పరస్, రాగి నిండి ఉంటాయి. అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అని అంటారు. అయితే బాదం పప్పుల్లో చేదువి కూడా ఉంటాయి. సాధారణ వాటి మాదిరిగానే ఇవి కూడా వాటిని పోలి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం కష్టం. తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి తెలుసుకోగలుగుతారు.

మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎందుకు ఉంటుందంటే.. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది. అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది.

అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?

2011 లో క్లినికల్ టాక్సికాలజీ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పది మందితో కూడిన ఒక బృందం పరిశోధనలు చేసింది. చేదు బాదం తీసుకోవడం వల్ల శరీరంలో సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తంలో చేదు బాదం తీసుకుంటే ప్రాణాంతకం అవుతుందని సదరు అధ్యయనం నిర్థారించింది. 2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ప్రచురించిన జర్నల్ కూడ ఇదే విషయాన్ని వెల్లడించింది. చేదు బాదంలో వివిధ పరిమాణంలో ఉంటుందని వాటిని తీసుకోవడం నిజంగా హానికరమని అధ్యయనం చెప్పుకొచ్చింది.

బాదంతో (Almonds) ఇలా చేసుకోండి

భారత్ లో అనేక రకాల బాదం ఉన్నాయి. అవన్నీ రుచిలో ఒకేలా ఉన్నప్పటికీ వాటి పరిమాణం, రంగు, ఆకృతిపరంగా విభిన్నంగా ఉంటాయి. కాలిఫోర్నియా, షాలిమార్, గుర్బంది, ప్రన్యాజ్, ముఖ్దూమ్, మమ్రా, కాగ్జి వంటివి అత్యంత ప్రసిద్ధి బాదం రకాలు. నానబెట్టిన బాదంను పాలుగా చేసుకోవచ్చు. పేస్ట్ గా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇది కూరకి చిక్కదనం ఇస్తుంది. బాదం కేక్, చాక్లెట్ కోటెడ్ బాదం, బాదం కుకీలు, బాదం హల్వా, ఆల్మండ్ ఫడ్జ్, ఆల్మండ్ బ్రౌనీస్ వంటి స్వీట్ ట్రీట్‌లు వీటితో చేసుకోవచ్చు. బాదం పొడి గ్లూటెన్ రహిత పిండి. ఆల్మండ్ బటర్ ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. బ్రెడ్, శాండ్ విచ్ మీద స్ప్రెడ్ చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.

Also Read:  Yawning: ఆవలింతలు అతిగా వస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Bitter Almonds
  • food
  • health
  • Life Style
  • tips
  • Tricks

Related News

Delicious Dishes

గ్యాస్‌తో పని లేకుండా ఫుడ్ త‌యారుచేసుకోండిలా!

గ్యాస్‌తో పని లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వాడకుండా తయారు చేయగల 3 ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం..!

    Latest News

    • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

    • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

    • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

    • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    Trending News

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd