Chicken : వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?
Chicken : రోజూ చికెన్ (Chicken) తినడం అలవాటు ఉన్నప్పటికీ, వేసవిలో దీన్ని పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
- By Sudheer Published Date - 03:18 PM, Wed - 26 March 25

వేసవి కాలంలో (Summer Season) ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాల అవసరం. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరికి రోజూ చికెన్ (Chicken) తినడం అలవాటు ఉన్నప్పటికీ, వేసవిలో దీన్ని పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా చికెన్ తింటే శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి, దానివల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
Wildfire : దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
వేసవి వేడిలో ఎక్కువగా చికెన్ (Chicken) తినడం వల్ల తలనొప్పి, కళ్ల మంటలు, రక్తపోటు పెరగడం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వేడిని తట్టుకోలేని వారిలో నీటి ఎద్దడితో పాటు కండరాల నొప్పులు కూడా రావచ్చు. మసాలాలు ఎక్కువగా వేసిన చికెన్ వంటకాలు శరీరానికి అధిక వేడి పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల వేసవి కాలంలో తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు.. ఆనందంగా ఉందంటూ పవన్ కల్యాణ్ ట్వీట్
ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం.. వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చికెన్ తీసుకోవడం మంచిది. అదనంగా దీని పొటెన్షియల్ దుష్ప్రభావాలను తగ్గించేందుకు చికెన్‌తో పాటు పచ్చిబొప్పాయి, పెరుగు, పుచ్చకాయ వంటి శీతల పదార్థాలను తీసుకోవడం మంచిది. ఎక్కువగా నీరు తాగడం, తాజా పళ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీర తేమను సమతుల్యం చేయొచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి వేడిని అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.