Diabetes: మధుమేహం ఉన్నవారు మెంతి ఆకు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. దీనినే షుగర్,చక్కెర
- By Anshu Published Date - 07:30 AM, Sun - 30 October 22

ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. దీనినే షుగర్,చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి వంద మందిలో దాదాపు 40 మంది వరకు ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంతే చాలు జీవితాంతం ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం లేకపోయినప్పటికీ షుగర్ ను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడానికి మాత్రం అనేక రకాల మందులు ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో షుగర్ సమస్యతో కేవలం పెద్దవారు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా బాధపడుతున్నారు.
డయాబెటిస్ పేషెంట్లు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్లు మెంతి ఆకు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ ఉన్నవారు మెంతి ఆకులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. మెంతి ఆకులలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్,విటమిన్ సి,, పొటాషియం, జింక్, సోడియం, విటమిన్ కె, విటమిన్ b6, యాంటీ ఆక్సిడెంట్స్, సెలీనియం లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మధుమేహం ఉన్నవారు మెంతి ఆకును వారి ఆహార పదార్థాలలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మెంతి ఆకులు మంచి మసాలా దినుసులా కూడా ఉపయోగపడతాయి. దీని ఆకులను ప్రతి రోజూ తిన్నా ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మెంతి ఆకులను తరచుగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ లేని వాళ్ళు ఆకును తరచుగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మెంతి అంకులు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి గుండెకు దివ్య ఔషధంలా పనిచేసీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మించి ఆకులతో పాటు మెంతి గింజలు కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలులు చేస్తాయి. మెంతులు నానబెట్టిన నీళ్లను ప్రతిరోజు పరగడుపున తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.