Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో మీకు తెలుసా?
Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Mon - 29 September 25

Health Tips: ప్రస్తుత రోజుల్లో మనుషుల ఆహారపు అలవాట్లతోపాటు జీవనశైలి కూడా పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యలు బారిన పడే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫుడ్స్ ని కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అశ్వగంధ.. ఇది శరీరంలోని కార్టిసాల్‌ను స్థిరీకరించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందట.
అలాగే శక్తిని పెంచి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని, రోజూవారీగా హార్మోన్లను సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. అవిసె గింజల నూనె.. ఇందులో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్ లకు ఇది ఒక సంపూర్ణ వనరు అని చెప్పాలి. ఈ నూనె కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అలాగే హార్మోన్లను సమతుల్యం చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవలసిన వాటిలో నల్ల జీలకర్ర కూడా ఒకటి. దీనిలో ఉండే థైమోక్వినోన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచి, మంటను తగ్గిస్తుందట.
అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, చర్మం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. బేర్బెరిన్.. అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుందట. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, జీవక్రియ, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని,అంతేకాకుండా, యాంటీ మైక్రోబయల్ రక్షణను అందిస్తుందని చెబుతున్నారు. మెంతులను కూడా డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయట. అలాగే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతూ, హార్మోన్లను సమతుల్యం చేస్తాయని, మహిళల్లో పాల ఉత్పత్తికి, పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలకు తోడ్పడతాయని చెబుతున్నారు.
సీ బక్‌థార్న్.. ఈ బెర్రీలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, సి, ఇ, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పునరుద్ధరించి, గుండె, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి తోడ్పడతాయట. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్లను నియంత్రించి, చర్మానికి తేమను, స్థితిస్థాపకతను ఇస్తూ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడతాయని చెబుతున్నారు. వెల్లుల్లి నూనెలో అల్లిసిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయట. రక్త ప్రసరణను మెరుగుపరచి, ఆక్సీకరణ ఒత్తిడి, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు. మన డైట్ లో చేర్చుకోవాల్సిన వాటిలో గుమ్మడి గింజలు కూడా ఒకటి. ఇవి పోషకాలకు నిలయం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, ఎముకల ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, నిద్రను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ప్రొస్టేట్, మూత్ర సంబంధిత ఆరోగ్యానికి తోడ్పడతాయని చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన వాటిలో డైట్ లో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అని చెబుతున్నారు.