Coldrif Syrup : తెలంగాణలో కోల్డ్ డ్రాప్ సిరప్ నిషేధం
Coldrif Syrup : తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోల్డిఫ్ దగ్గు సిరప్ (Coldrif Syrup) విక్రయంపై నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వాడకం వల్ల 14 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.
- By Sudheer Published Date - 06:30 PM, Sun - 5 October 25

తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోల్డిఫ్ దగ్గు సిరప్ (Coldrif Syrup) విక్రయంపై నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వాడకం వల్ల 14 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తక్షణమే చర్యలు తీసుకుని సిరప్‌పై నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
Congress Leaders : ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
పరిశీలనలో ఈ దగ్గు సిరప్‌లో 42% డయీథైలీన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఇది శరీరానికి విషపూరితం కావడంతో చిన్నారుల్లో తీవ్ర ప్రభావాలు చూపిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన మందులు మార్కెట్లోకి ఎలా వచ్చాయో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రజలు ఇప్పటికే ఫార్మసీల్లో లభించే దగ్గు సిరప్పులపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు ఈ సిరప్‌పై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా చర్యలు తీసుకోవడం ద్వారా పిల్లల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ స్టోర్లలో ఈ సిరప్‌ను వెంటనే వెనక్కి తీసుకునేలా డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించారు. ప్రజలు ఏవైనా అనుమానాస్పద మందులు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది.