Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Cloves: ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Fri - 26 September 25

Cloves: మన వంటింట్లో దొరికి మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. ఈ లవంగాలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మసాలా వంటలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. లవంగాలు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. లవంగాలు దంత నొప్పి తగ్గించడంతో పాటు, జీర్ణక్రియను మెరుగు పరచడం, యాంటీ ఆక్సిడెంట్లు అందించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
అలాగే లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉదర సంబందిత సమస్యల నుంచి విముక్తి పొందేందుకు లవంగాలు మంచి రెమిడీగా ఉపయోగపడతాయట. లవంగాలలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అలాగే జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని కూడా పెంచుతాయని చెబుతున్నారు. కాగా లవంగం రోజూ తీసుకోవడం ద్వారా గ్యాస్, అజీర్ణం వంటి వివిధ జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత రోజూ రెండు లవంగాలు పంటి మధ్యలో పెట్టుకుని నమలడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే లవంగాలు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చెబుతున్నారు. క్యాన్సర్ నివారణలో సహాయపడతాయట. కాగా వీటిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అలెర్జీలు వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు, కాబట్టి మితంగా వాడటం మంచిదని చెబుతున్నారు.