HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Careful About These Foods In Summer Is Good For Health

Foods to Avoid in Summer: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే?

వేసవికాలం మొదలైంది అంటే చాలు ఏక రకాల అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌

  • Author : Anshu Date : 15-03-2024 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good Food Display Nci Visuals Online
Good Food Display Nci Visuals Online

వేసవికాలం మొదలైంది అంటే చాలు ఏక రకాల అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంద‌రికి ఈ సీజ‌న్‌లోనూ ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. ఇక ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరం వేడిగా ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వేసవిలో వచ్చే డిహైడ్రేషన్ అలసట వడదెబ్బ కళ్ళు తిరగడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యల్లో రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అలాగే క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఇక కొంద‌రు నీళ్ల‌ను తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శరీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డతారు.

వడ దెబ్బ‌కు గుర‌వుతారు. కొన్ని సార్లు మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు కూడా ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. వేస‌వి సీజ‌న్‌లో ఆహారాల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా కొన్ని ర‌కాల ఆహారాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోకపోవటమే మంచిది. కాదని తీసుకుంటే మాత్రం స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేస‌విలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మ‌ద్యం సేవిస్తే ఆ దాహం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో నాలుక పొడి బారిపోయి శ‌రీరం డీహైడ్రేష‌న్గు రవుతుంది. ఈ పరిస్ధితి వల్ల లివ‌ర్‌ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వేస‌విలో మ‌ద్యం సేవించ‌డం ఏమాత్రం మంచిది కాదు. వేసవిలో నూనెతో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోరాదు.

వీటిని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాహం కూడా అధికంగా ఉంటుంది. ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ సీజ‌న్‌లో అధికంగా లభించే మామిడి పండ్ల‌ను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్త‌రుగా మించి అధికంగా తింటే మాత్రం శ‌రీరంలో వేడి పెరుగుతుంది. విరేచ‌నాలు అవుతాయి. ఈ సీజ‌న్‌లో త‌క్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి. కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను, మాంసాహారాల‌ను తీసుకోవటం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. క‌డుపులో మంట వస్తుంది. కాబ‌ట్టి ఈ ఆహారాలను ప‌రిమిత మోతాదులో తీసుకోవటం మంచిది. బేక‌రీ ప‌దార్థాలు, ఇత‌ర జంక్ ఫుడ్స్‌ను తిన‌డం కూడా మానేయాలి. ఇవి దాహం అధికంగా అయ్యేలా చేస్తాయి. శ‌రీరంలో నీటి శాతాన్ని త‌గ్గిస్తాయి. ఇది మ‌న‌కు ఈ సీజ‌న్‌లో మంచిది కాదు. టీ, కాఫీల‌ను త‌గ్గించాలి. వీటిని అధికంగా తీసుకుంటే గ్యాస్‌, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను తాగడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, నేరేడు పండు మొదలైనవి వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి మరియు మీకు చిరాకు అలసటను కూడా కలిగిస్తాయి. ఐస్‌క్రీమ్‌లు వేసవిలో వేడి ఎదుర్కోవడానికి చాలా మంది వీటిని తీసుకుంటారు. వేసవి కాలంలో ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల జలుబు సంబంధిత వ్యాధుల ప్రమాదం కలుగుతుంది. కాబట్టి వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • foods
  • Foods to Avoid in Summer
  • health tips
  • summer

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Latest News

  • పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

  • తిరుమలలో భక్తురాలికి పాము కాటు

  • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

  • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

  • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

Trending News

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd