Diabetes: రక్తంలో షుగర్ అదుపులో ఉండాలంటే డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సిందే!
షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలి అంటే ఉదయం పూట కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు తీసుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Fri - 31 January 25

మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇష్టం ఉన్నా సరే వాటిని వదిలేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయాలపై సరైన అవగాహన లేక కొన్ని ఆహార పదార్థాలను తినడం మానేస్తూ ఉంటారు. అయితే రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే అల్పాహారంలో కొన్నింటిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయట. మరి అందుకోసం ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోయా దోస మీకు దోసెలు ఇష్టమైతే, మీరు సాధారణ దోసెకు బదులుగా సోయా దోసను తీసుకోవచ్చు. సాధారణ దోస కంటే సోయా దోసలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ దోసె చాలా రుచిగా ఉంటుంది. అలాగే మరొక అల్పాహారం రాగి ఉతప్పం. డయాబెటిక్ రోగులకు రెగ్యులర్ దోస కంటే రాగి ఉతప్పం చాలా మంచిది. ఎందుకంటే రాగుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ రాగిని మీకు ఇష్టమైన కూరగాయలతో ఉడికించినట్లయితే, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప అల్పాహారం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోధుమ రవ్వ ఉప్మా కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందట. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇందులో క్యారెట్ బీన్స్ క్యాప్సికం ముక్కలు చేర్చుకుంటే మరింత రుచికరంగా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కని స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. మరొక అల్పాహారం చెన్నా సుండల్ లేదా వైట్ చెన్నా. ఈ అల్పాహారం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తరచుగా వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. కానీ రోజుకు 1/2 కప్పు కంటే ఎక్కువ తినకూడదట. లేకుంటే అది మంచికి బదులు కీడు చేస్తుందట. మరో సూపర్ అల్పాహారం అంటే రాగి ముద్ద అని చెప్పాలి. రాగులతో తయారు చేసిన ఎటువంటి పదార్థమైన షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. రాగుల్లో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మధుమేహం ఉన్న వారు ఈ రాగి ముద్దను అల్పాహారంగా తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట. రాగి ముద్ద తినలేము అనుకున్న వారు రాగు పిండిలో కొన్ని నీళ్లు కలిపి దోసె లాగా పోసుకుని తినడం లేదంటే రాగి గంజి తాగడం మంచిదని చెబుతున్నారు. ఈ రాగి ముద్దతో అంబలి కూడా చేసుకోవచ్చు. కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే ఓట్ మీల్ ఇడ్లీ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం షుగర్ ఉన్నవారికి మాత్రమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెసరపప్పు దోశ కూడా మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందట.