Winter Immunity: చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే!
- By Anshu Published Date - 08:32 AM, Sat - 22 November 25
Winter Immunity: చలికాలం వచ్చింది అంటే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, వంటి వాటితో పాటు చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవి ఉండకూడదు అంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చలికాలంలో లభించే పండ్లలో ఉసిరి కూడా ఒకటి. ఉసిరి శ్వాసకోశ ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన సీజనల్ సూపర్ ఫ్రూట్లలో ఒకటిగా చెప్పాలి. విటమిన్ సి, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇన్ఫెక్షన్లు, కాలుష్య కారకాలను, చలి వాతావరణం వల్ల కలిగే చికాకులను దూరం చేస్తుందట.
ఊపిరితిత్తులను స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని,ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులను దూరం చేస్తుందని చెబుతున్నారు. దగ్గు, సైనస్, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. శీతాకాలంలో తీసుకోవాల్సిన పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. దీనిలో పునికలాగిన్స్, ఆంతోసైనిన్స్ వంటి ఊపిరితిత్తులను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఈ సమ్మేళనాలు శ్వాసకోశ మార్గంలో మంటను తగ్గిస్తాయని, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణజాలాలను రక్షిస్తాయని చెబుతున్నారు. ఊపిరితిత్తులలో రక్త ప్రసరణను పెంచి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి సహాయపడుతాయట.
విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. కాగా కివిలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుందట. అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఊపిరితిత్తుల కణజాలాలలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందట. శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీర రోగనిరోధక ప్రతిస్పందనకు కివి మద్దతు ఇస్తుందని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మొత్తం శ్వాసకోశ పనితీరుకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ద్రాక్ష ఊపిరితిత్తుల ఆరోగ్యానికి విశేషమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఆస్తమా లేదా దీర్ఘకాలిక శ్వాస సమస్యల వంటి పరిస్థితులను తగ్గిస్తుందని, మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందని చెబుతున్నారు. వీటిలోని ఫైటోకెమికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తాయట.
కాగాబత్తాయిని చాలామంది సమ్మర్ కి మంచిదని అనుకుంటారు కానీ శీతాకాలంలో రిఫ్రెష్ ఇచ్చే సిట్రస్ పండు ఇది అని చెబుతున్నారు. ఊపిరితిత్తులకు అసాధారణమైన ప్రయోజనాలను అందిస్తుందట. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, శరీరాన్ని శుభ్రపరిచే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుందని, ఊపిరితిత్తుల కణజాలాలను మంట, కాలుష్యం వల్ల కలిగే నష్టాల నుంచి రక్షిస్తుందని, శ్లేష్మాన్ని వదిలించి శ్వాసకోశ మార్గాన్ని శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. దీని హైడ్రేటింగ్ స్వభావం ఊపిరితిత్తులలోని శ్లేష్మ పొరలకు మద్దతునిచ్చి తేమగా ఉంచుతుందట. చికాకులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. సీతాఫలంలో మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం, సహజ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శ్వాసకోశ మార్గంలో మంటను తగ్గిస్తుంది. సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం ఊపిరితిత్తుల కండరాలను సడలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శ్వాసలోపం, ఛాతీలో బిగుతు లేదా శీతాకాలంలో వచ్చే ఆస్తమా లక్షణాలను కంట్రోల్ చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. జలుబు, దగ్గు వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గుతుందని చెబుతున్నారు.