Ragi Java: వామ్మో.. వేసవిలో రాగి జావ తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?
వేసవికాలంలో ఎంత ఎనర్జీ గా ఉన్నా కూడా అలా బయట ఒక అరగంట సేపు తిరిగి వస్తే చాలు వెంటనే అలసిపోతూ నీరసించి పోతుంటారు. వేసవిలో ఎక్కువగా ఆహార పదార
- By Nakshatra Published Date - 08:30 PM, Mon - 19 June 23
వేసవికాలంలో ఎంత ఎనర్జీ గా ఉన్నా కూడా అలా బయట ఒక అరగంట సేపు తిరిగి వస్తే చాలు వెంటనే అలసిపోతూ నీరసించి పోతుంటారు. వేసవిలో ఎక్కువగా ఆహార పదార్థాల కంటే పానీయాల వైపు దృష్టి మల్లుతూ ఉంటుంది. ఎక్కువగా చల్లనివి తాగాలని అనిపిస్తూ ఉంటుంది. వేసవిలో చల్లని పానీయాలు ఎంత తాగినా కూడా ఇంకా ఇంకా తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ కు గురికావడం, వడదెబ్బ బారిన పడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వేసవికాలంలో ఉదయం తీసుకునే ఆహారం రోజంతా హుషారుగా పని చేయడానికి కావాల్సిన శక్తిని అందించేలా ఉండాలి.
అందుకే వేసవి కాలంలో రాగి జావ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల తక్షణ శక్తి రావడంతో పాటు, రోగనిరోధక శక్తి మెరుగుపడటం, శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. కాగా రాగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలు కాకుండా కాల్షియం ఎక్కువగా ఉండేది రాగుల్లోనే. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. జీర్ణక్రియ వేగాన్ని మెయింటైన్ చేస్తుంది. రక్తంలో చక్కెర పరిధిని నియంత్రణలో ఉంచుంతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వారు, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్న వారికి రాగి జావ ఒక వరం లాంటిది.
ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. రాగుల్లో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. ఇలా బరువు తగ్గడానికి దారితీస్తుంది. అలాగే ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమితో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా రాగులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమలతో పోలిస్తే రాగులు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో గ్లూటెన్ ఉండదు. ఇది శరీరంలో మరింత ఆల్కలీన్ మీడియంను సృష్టిస్తుంది. కాబట్టి వేసవిలో రాగిజాగా తాగడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు కావాల్సిన శక్తి లభిస్తుంది.
Related News
Summer: సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం మస్ట్.. ఎందుకంటే
Summer: వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యం. వేసవిలో లిక్విడ్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో నీటి కొరత లేకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగండి. దీని కారణంగా, శరీరంలో తగినంత శక్తి, ఖనిజాల సమతుల్యత ఉంది. వేసవిలో ఎప్పుడైనా కొబ్బరి న�