Keera Dosa : కీరదోసకాయ వలన కలిగే ఉపయోగాలు.. ఎండాకాలం కచ్చితంగా తినండి..
ఎండాకాలంలో మనం చాలా ఎక్కువగా నీరు(Water) తాగవలసి ఉంటుంది లేదా నీరు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాల్సి వస్తుంది. కీరదోసకాయలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది.
- Author : News Desk
Date : 23-05-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
కీరదోసకాయ(Keera Cucumber) మనకు అన్ని కాలాల్లో దొరికినా ఎండాకాలం(Summer)లోనే ఎక్కువగా అందరూ తింటారు. దీనిని ఎండాకాలంలో తినడం వలన మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోసకాయను అలాగే డైరెక్ట్ తినేయొచ్చు. మజ్జిగ(Butter Milk) లేదా పెరుగు(Curd)లో వేసుకొని కూడా తినవచ్చు. ఎండాకాలంలో మనం చాలా ఎక్కువగా నీరు(Water) తాగవలసి ఉంటుంది లేదా నీరు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాల్సి వస్తుంది. కీరదోసకాయలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. కీరదోసకాయను విడిగా తినలేకపోతే సలాడ్ లేదా శాండ్విచ్ లలో వేసుకొని తినవచ్చు.
* కీరదోసకాయను తినడం వలన దానిలో ఉండే నీరు మనం డీహైడ్రాట్ కాకుండా చేస్తుంది.
* కీరదోసకాయలో ఉండే విటమిన్లు సి, కె , మెగ్నీషియం, పొటాషియం మన శరీరంలో వ్యాధి నిరోధకవ్యవస్థను పెంచుతాయి.
* కీరదోసకాయను తినడం వలన అది మన శరీరంలో చేరిన వ్యర్ధాలను బయటకు పంపించి పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది.
* కీరదోసకాయలో ఉండే పీచు పదార్థం మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* కీరదోసకాయలో ఉండే క్యాన్సర్ నిరోధక గుణాలు రొమ్ము, అండాశయ క్యాన్సర్ లను అరికడుతుంది.
* ఎండ వలన కళ్ళు అలసిపోయిన లేదా కళ్ళు దురదలు, కళ్ళు మంటలు ఉంటే మన కళ్ళ పైన కీరదోసకాయ ముక్కలను ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళు మామూలు స్థితికి వస్తాయి.
* మోచేతులు, మోకాళ్ళపైన ఉన్న నలుపుదనం తగ్గడానికి కీరదోసకాయ గుజ్జుతో మర్దన చేయాలి.
* కీరదోసకాయ గుజ్జును చేతులు, పాదాలపైన ఉన్న మురికిని పోగొట్టడానికి కూడా మర్దన చేయవచ్చు.
* కీరదోసకాయను తినడం వలన రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి.
* కీరదోసకాయలో ఉండే బీటాకెరోటిన్ మన చర్మాన్ని కూడా రక్షిస్తుంది.
Also Read : Jaggery Water : బెల్లం నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?