Black Rice: బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
బ్లాక్ రైస్ తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:34 AM, Tue - 8 April 25

మామూలుగా ఎక్కువ శాతం మంది తినే రైస్ వైట్ రైస్. కానీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి కాస్త అవగాహన పెరగడంతో చాలామంది వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ ని ఎక్కువగా తింటున్నారు. ఇవి కాస్త రేటు ఎక్కువే అయినప్పటికీ ఆరోగ్యం కోసం వీటిని కొనుగోలు చేసి మరీ తింటున్నారు. అయితే వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్లాక్ రైస్ వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్లాక్ రైస్ లో ప్రోటీన్, విటమిన్స్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుందట. దీంతో బాడీ వీక్ అవ్వదని చెబుతున్నారు. ఈ బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయట.
ఇవి బాడీ నుండి టాక్సిన్స్ ని దూరం చేస్తాయట. దీంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలకి కారణమవుతుందని చెబుతున్నారు. కాగా బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. అలాగే ఇందులోని ఫ్లేవనాయిడ్స్ గుండె సమస్యల నుంచి వచ్చే మరణాలని తగ్గిస్తాయని చెబుతున్నారు. బ్లాక్ రైస్ లోని ఆంథోసైనిన్స్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగ్గా చేస్తాయట. వీటిని తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయట. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయట. నల్లబియ్యం లోని ఆంథో సైనిన్స్ కూడా క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని, అదే విధంగా, బ్లాక్ రైస్ లోని ఆంథో సైనిన్స్ మానవ రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యని తగ్గించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే వాటి పెరుగుదల, వ్యాప్తి సామర్థ్యాన్ని తగ్గించాయని చెబుతున్నారు. బ్లాక్ రైస్ లో ఎక్కువగా లుటీన్, జియాక్సంతిన్స్ లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడే రెండు రకాల కెరోటినాయిడ్ష్. ఈ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయట. మీ కళ్లని ఫ్రీ హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడేందుకు హెల్ప్ చేస్తాయని, ముఖ్యంగా, ప్రమాదకరమైన నీలికాంతి తరంగాలను ఫిల్టర్ చేసి రెటీనాని కాపాడేందుకుందు సాయపడతాయి. ఈ బియ్యం తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు.. అదేవిధంగా ఈ రైస్ లో ప్రోటీన్, ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయట. ఇవి రెండు కూడా ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావనని పెంచుతాయట. ఇది బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని, ఆంథోసైనిన్స్ కొవ్వు శాతాన్ని తగ్గించి బరువుని తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిని బ్రౌన్‌రైస్ తో కలిపి తీసుకున్నప్పుడు బరువు తగ్గడం ఈజీ అవుతుందట.