Lemon Water: వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు ఎక్కువగా పానీయాలు తాగడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎక్కువ శాతం మంది వేసవిలో నిమ్మరసం తాగడానికి బాగా ఇష్ట
- By Anshu Published Date - 09:30 PM, Tue - 13 June 23

వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు ఎక్కువగా పానీయాలు తాగడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎక్కువ శాతం మంది వేసవిలో నిమ్మరసం తాగడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సిటీలలో ఎక్కువగా తిరిగేవారు బయట ఎక్కువ సేపు పని చేసేవారు రోజుల్లో ఎక్కువ శాతం ఎక్కువ మొత్తంలో నిమ్మరసాన్ని తాగుతూ ఉంటారు. సమ్మర్ లో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా నిమ్మకాయ నీరు తీసుకోవాలి. నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో సులువుగా లభించే నిమ్మరసం ఆరోగ్య గుణాలతో నిండి ఉంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
ఇందులో థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి 6, విటమిన్ ఈ , ఫోలేట్ వంటి విటమిన్లు నిమ్మకాయల్లో ఉంటాయి. నిమ్మకాయ నీటిని తీసుకోవడం ద్వారా ఊబకాయం సమస్యను అధిగమించవచ్చు. రక్తపోటు, డిప్రెషన్, కాలేయానికి నిమ్మకాయ చాలా మంచిది. బట్టతల జుట్టు సమస్యను తొలగించడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు. వేసవిలో నిమ్మకాయతో చేసిన డ్రింక్ తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుకోవచ్చు. ఇకపోతే మరి నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. వేసవి కాలంలో నిమ్మరసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ సిట్రస్ పండ్లలో ఒకటి, నిమ్మకాయ విటమిన్ సి మంచి మూలం, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఒకవేళ మీరు ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మకాయ నీరు శరీరం నుండి విషపూరిత మూలకాలను అంటే యాంటీ ఆక్సిడెంట్లను బయటకు తీయడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే డిప్రెషన్ తో బాధపడేవారు నిమ్మరసం తీసుకోవడం మంచిది. నిమ్మకాయలో ఉండే గుణాలు డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. లెమన్ వాటర్ తీసుకోవడం రక్తపోటు రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో సిట్రస్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి పని చేస్తుంది. మీరు జీర్ణక్రియ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, నిమ్మరసంలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగండి. నిమ్మ నీరు హైడ్రోక్లోరిక్ యాసిడ్, పిత్త స్రావం ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జీర్ణక్రియ కడుపు గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే గుణాలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. నిమ్మకాయ స్వభావం ఆమ్లంగా ఉండవచ్చు, కానీ ఇది శరీరంలో ఆల్కలీన్ ప్రభావాన్ని ఇస్తుంది. నిమ్మకాయ నీటిని తీసుకోవడం మూత్రపిండాలకు క్లెన్సర్‌గా పనిచేస్తుంది.