Ghee Coffee Benefits: కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే అన్ని రకాల లాభాలా!
కాఫీలో నెయ్యిని కలుపుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:30 PM, Sun - 11 August 24

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే నెయ్యిని తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు నెయ్యి కాఫీ తాగారా. కొంతమంది ఈ పేరుని ఫస్ట్ టైమ్ వింటూ ఉంటారు. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం ఏంటి అని అనుకుంటున్నారా. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. కాఫీలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెయ్యి కాఫీ ఉదయాన్నే తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుందట. కాగా నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం, బరువు తగ్గడంతో పాటు చాలా బెనెఫిట్స్ ఉంటాయట. ఇందుకోసం ముందుగా సాధారణంగా కాఫీ తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు కాఫీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీది నుంచి దించేసుకొని తాగవచ్చు. ఇంకా బాగా కలవాలంటే బ్లెండ్ కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నెయ్యి కాఫీ తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుందట. కాగా నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి.
దీంతో నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవి శరీరానికి అందుతాయి. అలాగే శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఈ కాఫీ కలిగిస్తుంది. నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుందట. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుందట. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉండి అది ఆకలిని తగ్గింస్తుంది. దీని వల్ల త్వరగా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. మొండి కొవ్వులను కరిగించటంలో కూడ ఇది సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందట. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుందట.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.