Beetroot Juice: గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తో షుగర్, బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చా?
ప్రతిరోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందడంతో పాటు షుగర్,బీపీ వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Wed - 19 March 25

మన వంటింట్లో దొరికే కాయగూరల్లో బీట్ రూట్ కూడా ఒకటి. ఇది దుంప జాతికి చెందినది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బీట్ రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బీట్రూట్ ను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తినవచ్చు. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూరల రూపంలో లేదంటే నేరుగా కూడా తినవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా రక్తహీనత సమస్యను తగ్గించడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుందని చెబుతున్నారు.
మరి బీట్ రూట్ జ్యూస్ వల్ల ఇంకా ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఇక బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతీ రోజూ ఉదయం ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిదని ఇది రక్తాన్ని పెంచడంతోపాటు రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
కాగా బీట్ రూట్ లో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయట. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. కాగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుందట. ఇది రక్త పోటును నియంత్రించడంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే రోజూ ఉదయం ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఈ జ్యూస్ లో ఉండే నైట్రేట్ గుండె జబ్బులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు