Overweight @ Diabetes: అధిక బరువు, ఇన్సులిన్ అసమతుల్యతలతో.. షుగర్ వార్నింగ్ బెల్!!
అధిక బరువు అనేది ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ బరువుని తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు.
- By Hashtag U Published Date - 06:45 AM, Sat - 3 September 22

అధిక బరువు అనేది ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ బరువుని తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు. దానికోసం రకరకాల ఎక్సర్ సైజ్‌లు చేస్తుంటారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి రక్తంలోని చక్కెర స్థాయిలను చాలా ఎక్కువగా పెంచుతాయి. ఈవిధమైన ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం పేషెంట్లు బాగా బరువు పెరగడం అనేది జరుగుతుంది.
టైప్ 2 వ్యక్తులలో..
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో అయితే శరీరం ఇన్సులిన్ చర్యను ఖచ్చితంగా నిరోధించడం జరుగుతుంది. అందువల్ల ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం చూపించదు. అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలని మరింతగా పెంచడం జరుగుతుంది. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం అనేది చాలా కష్టమవుతుంది. షుగర్ తో బాధపడుతున్న వ్యక్తులు అన్ని సమయాలలో కూడా మంచి ఆకలితో ఉంటారు. ఈ కారణంగా అధికంగా తింటారు. ఇక దీనివల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి బాగా పెరిగి త్వరగా బరువు పెరగడం జరుగుతుంది. షుగర్ వ్యాధికి కి వాడే కొన్ని మందులు కూడా అధిక బరువు అనేది పెరగడానికి కారణమవుతాయి.
జీవన శైలి కారణంగా..
మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
ఇన్సులిన్ నిరోధకత..
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో శరీరం ఇన్సులిన్ చర్యను నిరోధిస్తుంది. తద్వారా ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం చూపదు. అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెంచుతాయి. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం కష్టమవుతుంది. డయాబెటిస్ మెడిసిన్
ఇన్సులిన్ కొవ్వును నిల్వ చేయడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ చికిత్సకు ఇన్సులిన్ తీసుకోవడం కూడా కొంత బరువు పెరగడానికి దారితీస్తుంది. స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈవివరాలు గుర్తించారు.
ఇన్సులిన్ అంటే ?
ఇన్సులిన్ అనేది ఒక రకమైన హార్మోన్. ఇది కార్బోహైడ్రేట్లు, కొవ్వును శక్తిగా మార్చే పనిని చేస్తుంది. అంటే మనం ఏది తిన్నా అది శక్తిగా మారినప్పుడే శరీరం కండీషన్‌లో ఉంటుంది. మన ఆహారంలో ప్రధాన భాగమైన కార్బోహైడ్రేట్లు అత్యధిక శక్తిని అందిస్తాయి. ఆ కార్బోహైడ్రేట్లను ఇన్స్‌లిన్ శక్తిగా అంటే గ్లూకోజ్‌గా మార్చి మన శరీరంలోని వందలాది కణాలకు రవాణా చేస్తాయి. శరీరంలో ఇన్సులిన్ నిష్పత్తి క్షీణించినప్పుడు అంటే అది పెరగడం లేదా తగ్గే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇది టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది. శరీరంలోని పేగుల పైన, ఉదరం ఎడమ భాగంలో ఒక అవయవం ఉంటుంది. దీనిని ప్యాంక్రియాస్ అంటారు. ఇక్కడే ఇన్సులిన్ తయారవుతుంది. ప్యాంక్రియాస్ మన కాలేయంతో కలిసి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మనం ఏదైనా తిన్నప్పుడల్లా కాలేయం పాంక్రియాస్‌కు ఎక్కువ ఇన్సులిన్ అవసరమని సందేశం పంపి క్లోమం, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి వెంటనే శరీరానికి సరఫరా చేస్తుంది. తద్వారా మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది.
దాల్చిన చెక్కతో బరువు తగ్గొచ్చు..
బరువు తగ్గడం అంటే.. కేవలం శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరగడం మాత్రమే కాదు.. ద్రవాల స్థాయులు కూడా తగ్గుతాయి. ఇలా రెండూ బ్యాలన్స్ అవుతూ.. ఒక క్రమపద్ధతిలో బరువు తగ్గడం వల్లనే శరీర పరిమాణం కూడా క్రమంగా తగ్గుతుంది. ఇందుకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరిగి.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొవ్వులు పేరుకు పోకుండా ఉండడంతో పాటు స్థూలకాయం, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.
Related News

Vitamin D: విటమిన్ డి లోపం వల్ల షుగర్ వ్యాధి వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం. అటువంటి వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మనకు ఎన్నో రకాల ఆహార పదార్థాల ద్వారా మాత్రమే కాకుండా