Beer: ఏంటి ప్రతి రోజు బీరు తాగితే నిజంగానే పొట్ట వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది ప్రతి రోజు బీరు తాగితే పొట్ట వస్తుందని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:00 PM, Tue - 18 March 25

బీర్ తాగడం ఆరోగ్యానికి కొంతమంది మంచిది అంటే మరి కొంతమంది చెడ్డది అని అంటూ ఉంటారు. నిపుణులు కూడా ఆరోగ్యానికి బీరు చాలా మంచిదని చెబుతున్నారు. బీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎలా పడితే అలా ఎంత పడితే అంత తాగితే మాత్రం సమస్యలు తప్పవు. బీర్ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అలా అని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే చాలామంది బీరు తాగితే పొట్ట వస్తుందని అంటూ ఉంటారు. నిజంగానే బీరు తాగితే పొట్ట వస్తుందా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బీర్ తాగిన వెంటనే అది అన్ననాళం ద్వారా నేరుగా పొట్టకు వెళ్తుంది. ఆ తర్వాత బీర్ లోని ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలుస్తుంది. బీర్ లోని మరో పదార్థమైన ఎసిటైల్ CoA నుంచి కొవ్వు ఉత్పత్తి అవ్వడం మొదలవుతుందట. అయితే ప్రతి రోజు బీర్ తాగేవాళ్లలో ఈ ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయట. కాగా శరీరం మొదట ఆల్కహాల్ ను కరిగించడానికి ప్రాధాన్యం ఇస్తుందట.
ఫలితంగా మిగిలిన ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకుండా కొవ్వుగా మారుతాయట. అందుకే పొట్ట వస్తుందని చెబుతున్నారు. అయితే బీర్ తాగినప్పటికీ పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. అధిక బరువు, పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్లు బీర్ కు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. బీరు తాగినా కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలట. సన్నగా ఉన్నవాళ్లు బీర్ తాగితే ఫ్యాట్ ఉత్పత్తి కాదు అని కాదు. బీర్ ఫ్యాట్ పెంచుతుందనేది మాత్రం నిజమని చెబుతున్నారు. బీర్ తాగడం మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎంతపడితే అంత తాగకూడదని చెబుతున్నారు. అలాగే మోతాదుకు మించి బీర్ తీసుకుంటే నెమ్మదిగా ఆల్కహాల్ కి అలవాటు పడే ప్రమాదం ఉంటుందని, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.