Bedwetting: రాత్రిళ్లు మీ పిల్లలు పక్క తడుపుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!
కొన్నిసార్లు పిల్లలు తమ మూత్రాశయం మూత్రంతో నిండిపోయిందనే విషయాన్ని గుర్తించలేకపోతారు. దాంతో మూత్ర విసర్జన చేస్తారు.
- By Gopichand Published Date - 08:30 PM, Sat - 6 December 25
Bedwetting: పిల్లలు పగటిపూట లేదా రాత్రిపూట బెడ్ తడపడం (Bedwetting) చిన్న వయసులో సర్వసాధారణంగా కనిపిస్తుంది. చాలాసార్లు పిల్లలు 7-8 సంవత్సరాలు వచ్చినా కూడా పడక తడుపుతుంటారు. చాలా మంది పిల్లలు రాత్రిపూట నిద్రలో పడక తడుపుతుంటారు. దీనిని వైద్య పరిభాషలో బ్రెడ్‌వెట్టింగ్, నైట్‌టైమ్ ఇన్‌కంటినెన్స్ (Nighttime Incontinence) లేదా నాక్టుర్నల్ ఎన్యూరిసిస్ అని కూడా అంటారు. చాలా మంది పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేసిన తర్వాత మేల్కొని చాలా సిగ్గుపడతారు. ముఖ్యంగా 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పడక తడపడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యను దూరం చేసేందుకు కొన్ని చిట్కాలను పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు పడక తడిపితే ఏం చేయాలి?
పిల్లలు రాత్రి నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే వారికి ఖర్జూరం (Dates) తినిపించవచ్చని చెప్పారు. ఖర్జూరం తీసుకోవడం వలన పిల్లలు పడక తడపడం అనే అలవాటును మానుకుంటారని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం పిల్లలకు రాత్రిపూట 2 నుండి 3 ఖర్జూరాలను పాలతో పాటు కొద్దిగా మరిగించి ఇవ్వవచ్చు. ఈ ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకుంటే పడక తడపడం అలవాటు తగ్గిపోతుంది. దీనితో పాటు ఖర్జూరాన్ని దంచి, వేయించిన నల్ల నువ్వులతో కలిపి లడ్డూలు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఖర్జూరం లడ్డూలు కూడా తరచుగా మూత్ర విసర్జన చేసే అలవాటును అరికడతాయి. పడక తడిపే పిల్లలకు నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు కూడా తినిపించవచ్చు. నువ్వులు- బెల్లం లడ్డూలు తిన్న తర్వాత పిల్లలకు అర్ధరాత్రి నిద్రలో మూత్ర విసర్జన కాదు.
Also Read: Diseases: యువతలో పెరుగుతున్న వ్యాధులపై షాకింగ్ రీజన్..!
పిల్లలు పడక తడపడానికి కారణాలు
పిల్లల వయస్సు 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ పడక తడపడానికి అలవాటు పడడానికి ఈ కింది కారణాలు ఉండవచ్చు!
మూత్రాశయం చిన్నగా ఉండటం: పిల్లల మూత్రాశయం (బ్లాడర్) చిన్నగా ఉంటే అది రాత్రిపూట మూత్రాన్ని నిలుపుకోలేకపోతుంది.
బ్లాడర్ నిండిన అంచనా లేకపోవడం: కొన్నిసార్లు పిల్లలు తమ మూత్రాశయం మూత్రంతో నిండిపోయిందనే విషయాన్ని గుర్తించలేకపోతారు. దాంతో మూత్ర విసర్జన చేస్తారు.
హార్మోన్ల అసమతుల్యత: చిన్నతనంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటేదాని వలన కూడా మూత్రం లీకేజ్ కావచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా పిల్లలు పడక తడపవచ్చు.
మధుమేహం: చిన్న పిల్లలలో రాత్రిపూట పడక తడపడం మధుమేహం (డయాబెటిస్) ప్రారంభ లక్షణం కావచ్చు.
నరాల వ్యవస్థ సమస్య: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాకుండా నరాల వ్యవస్థలో సమస్య ఉంటే కూడా పిల్లలు రాత్రిపూట పడకపై మూత్ర విసర్జన చేయవచ్చు.
ఒత్తిడి లేదా ఆందోళన: పిల్లలలో ఒత్తిడి, ఆందోళన కూడా పడక తడపడానికి కారణం కావచ్చు.