Hair Fall: జుట్టు రాలే సమస్య తగ్గాలంటే రాత్రి పూట ఇలా చేయాల్సిందే!
జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే రాత్రి పూట పడుకునే కొన్ని రకాల పనులు చేయాలనీ చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:33 PM, Thu - 15 August 24

ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వైద్యుల సలహా పాటించడంతోపాటుగా, అనేక రకాల హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు హెయిర్ ఫాల్ సమస్య తగ్గదు. దీంతో చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అయితే హెయిర్ ఫాల్ తగ్గాలంటే రాత్రి పూట ఒక పని చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీరు ఉపయోగించే దిండు కూడా మీ జుట్టురాలడానికి కారణం కావచ్చు. మీరు కాటన్ పిల్లో కవర్ వాడటం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దానికి బదులు సాటిన్ క్లాత్ తో ఉండే పిల్లో కవర్ వాడటం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల జుట్టు రఫ్ గా మారడం, ఊడిపోవడం లాంటి సమస్య ఉండదు. అదేవిధంగా ఉదయాన్నే లేవగానే చాలామంది జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కేవలం ఉదయం మాత్రమే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా తల దువ్వుకుని పడుకోవడం మంచిదని చెబుతున్నారు. జుట్టు రఫ్ గా మారకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా తలలో తయారయ్యే సహజ నూనెలు కుదుళ్ల నుంచి చివర్ల వరకు చేరడంలో సహాయపడుతుంది.
మనం ఎలాంటి హెయిర్ బ్యాండ్ వాడుతున్నాం అనేది కూడా జుట్టు రాలడం పై ఆధారపడి ఉంటుందట. జుట్టును గట్టిగా పట్టి ఉంచే రబ్బరు బ్యాండ్లు కాకుండా, స్క్రంచీస్ వాడటం అలవాటు చేసుకోవాలి. వాటి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది. కాబట్టి జుట్టు ఊడుతుందనే భయం ఉండదు. హెయిర్ డ్యామేజ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే తలకు నూనె అప్లై చేసేటప్పుడు తల నుంచి చివర్ల వరకు నూనె అప్లై చేయాలి. కానీ చాలామంది చివర్ల అప్లై చేయరు. కానీ అలా అస్సలు చేయకూడదు. తలపై నుంచి చివర్ల వరకు అప్లై చేస్తే హెయిర్ డ్యామేజ్ బ్రేకేజ్ వంటి సమస్యలు ఉండవు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలో తడి తలతో అస్సలు అనుకోకూడదు. ఇలా పడుకుంటే ఎక్కువ మొత్తంలో హెయిర్ ఫాల్ అవుతుంది.
note : పైన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.