Banana: అరటిపండును పరగడుపున తింటే ప్రమాదమా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ మరి పరగడుపున అరటిపండు తినవచ్చో తినకూడదో ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:14 PM, Fri - 11 April 25

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సీజన్లలో ఏడాది మొత్తం అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ పండు ధర కూడా తక్కువగానే ఉంటుంది. కొంతమంది అరటిపండు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే తెగ తినేస్తూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు అరటిపండు తింటూనే ఉంటారు. అరటి పండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కూడా కలుగుతాయి. అయితే అరటి పనులను ఉదయం పూట తినవచ్చా? లేదంటే రాత్రి పూట తినాలా? ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండ్లను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం చాలా మంచిదట. ముఖ్యంగా ఉదయం అల్పాహారం సమయంలో అరటిపండును తీసుకోవడం మరింత మంచిదని చెబుతున్నారు. రాత్రి పూట మాత్రం అరటిని తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుందని ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుందట. అలాగే రాత్రి తింటే శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుందని అందుకే దగ్గు ఉన్నవారు రాత్రి తీసుకోకూడదని చెబుతున్నారు. అరటిపండును ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటేనే ఎక్కువ లాభాల ఉంటాయట. కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోకముందు అరటిపండును తింటారు. ఇలా తినడం అసలు మంచిది కాదట.
అరటిలో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నారు. అందుకే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. కాగా అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్, ట్రిప్టోపాన్ గుణాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి సెరోటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేసి ఆందోళనను తగ్గించే యాంటీ డిప్రసెంట్ గా పనిచేస్తాయట. బరువు తగ్గడం, గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా బాగా పండిన అరటిపండులో స్టార్చ్ పూర్తిగా విరిగిపోయి తీపి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని శరీరానికి అందుతుందని వెల్లడిస్తున్నారు.