Almonds : ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
రాత్రి సమయంలో బాదంపప్పు (Almonds) నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటూ ఉంటారు. అయితే మీరు కూడా ఇలాగే పరగడుపున నానబెట్టిన బాదంపప్పును తింటున్నారా..?
- By Naresh Kumar Published Date - 09:40 PM, Tue - 26 December 23

Tips for Eating Almonds in the Morning : డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది ఇష్టపడే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు (Almonds) కూడా ఒకటి. కొంతమంది బాదంపప్పును నేరుగా తింటే మరి కొంతమంది నానపెట్టుకొని తింటూ ఉంటారు. రాత్రి సమయంలో బాదంపప్పు (Almonds) నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటూ ఉంటారు. అయితే మీరు కూడా ఇలాగే పరగడుపున నానబెట్టిన బాదంపప్పును (Almonds) తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
We’re now on WhatsApp. Click to Join.
మాములుగా బరువు తగ్గాలనుకునేవారు రోజు డైట్ లో తప్పనిసరిగా ఈ బాదంపప్పును తీసుకుంటూ ఉంటారు. దీనిని ఎక్కడికి అయినా సరే తేలిక తీసుకెళ్లడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి చాలామంది బాదంపప్పును ఇష్టంగా తింటూ ఉంటారు. బాదం పప్పుని డైరెక్ట్ గా తీసుకోకపోయినా డిసార్ట్స్ జ్యూస్ లు లాంటి వాటి తో ప్రతి ఒక్కరు తప్పకుండా భాదాన్ని వాడుతూ ఉంటారు. పచ్చి బాదంపప్పు లేదా నానబెట్టిన బాదం ఈ రెండిట్లో ఏది మంచిది అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఇంకొందరైతే నానబెట్టిన బాదం పప్పు మంచిదని నమ్మితే కొందరు ఒట్టి బాదంపప్పు మాత్రమే ఆరోగ్యానికి మంచిదని వాదిస్తూ ఉంటారు.
ఒక సర్వే ప్రకారం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి అని తెలిసింది. బాదంపప్పును ఏ రూపంలో ఉన్న అందులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి టు విటమిన్ ఈ లాంటి వాటిలలో ఎటువంటి తేడాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నానబెట్టిన బాదంపప్పు తీసుకోవడానికి సులభంగా ఉండటంతో చాలామంది ఆ విధంగా తింటూ ఉంటారు. అని అంటున్నారు. బాదంపప్పు ఆరోగ్యకరమైనది పౌష్టికాహారమని ఏ విధంగానైనా తీసుకోవచ్చు అని నిరభ్యంతరంగా తినవచ్చట. ఎవరైనా సరే నానబెట్టేనా బాదంపప్పు అయినా తీసుకోవచ్చు. లేదా పచ్చి బాదంపప్పు అయినా తీసుకోవచ్చు.
Also Read: White Onion Benefits : తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?