HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Eating Prawns Know These Facts

Prawns: రొయ్యలు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

రొయ్యలు తింటే కేవలం ఆరోగ్య ప్రయోజనాలు కలగడం మాత్రమే కాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 24-12-2024 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prawns
Prawns

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలతో అనేక రకాలైన వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. స్టాటర్స్, స్నాక్స్, బిర్యానీలు, పులుసు,వేపుడు రకరకాలైన కర్రీలు ఇలా ఏది చేసినా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రొయ్యలు తినడం మంచిదే కానీ అలా అని మితిమీరి ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. రొయ్యలు ఎక్కువగా దొరికే ప్రాంతంలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా రొయ్యలు ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చేపలు లేదా రొయ్యల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే వ్యాధి ఎలర్జీ. ఎలర్జీ వ్యాధి ఉన్నవారు ఈ రొయ్యలను అస్సలు తినకూడదు. అలాగే దగ్గు జలుబు తుమ్ములు ఆయాసం ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ రొయ్యలను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. వీటితో పాటుగా ఇస్నోఫీలియా, దురదలు, దద్దుర్లు,బొల్లి మచ్చలు, నల్ల మచ్చలు,కడుపులో నొప్పి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చేపలు తినకూడదట. రొయ్యలు అసలే తినకూడదని చెబుతున్నారు.

అయితే ఈ సమస్యలతో ఇదివరకే బాధపడుతున్న వారు ఏం కాదులే ఏమవుతుంది అని రొయ్యలు తింటే మాత్రం ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయట. కాబట్టి పైన చెప్పిన వ్యాధులు ఉన్నవారు నువ్వు రొయ్యలు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు. రొయ్యలు మలబద్ధకాన్ని కలిగిస్తాయట. అంతేకాకుండా తగ్గిపోయిన పాత నొప్పులను కూడా తెచ్చి పెడతాయని చెబుతున్నారు. అయితే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒకవేళ రొయ్యలను తినాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Prawns
  • health care
  • health tips
  • Prawns

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd