Beer: ఏంటి బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారా.. చర్మ సమస్యలు రావా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు రావు అని కొంతమంది చెబుతున్నారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:30 AM, Sun - 25 May 25

బీర్లతో స్నానం ఏంటి అని అనుకుంటున్నారా, అవునండి మీరు విన్నది నిజమే ఇలా బీర్లతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుందట. ఇది మేము చెబుతున్న మాట కాదండోయ్ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. మరి బీరుతో స్నానం చేస్తే ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా బీర్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పొడిబారిన చర్మాన్ని ఇవి చాలా మృదువుగా మార్చేస్తాయి. ఇక బీర్ లోని ఈస్ట్ లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుందట.
ఇది కూడా చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుందట. చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుందని, అంతేకాకుండా బీర్ బాత్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగుండడంతో పాటు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. బీరులో ఈస్ట్ తో పాటు పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణాలు డ్యామేజ్ కాకుండా ఇవి అడ్డుకుంటాయట. అలాగే బీర్ బాత్ వల్ల ఒత్తిడి తగ్గిపోయి రిలాక్స్ గా ఫీల్ అవ్వ వచ్చట. అయితే బీర్ తో పాటు వేడి నీళ్లు, ఎండిపోయిన పూలు లాంటివి వేసుకుని స్నానం చేస్తే రెట్టింపు ఆరోగ్యం ఉంటుందని, ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతున్నారు.
మనసు చిరాగ్గా ఉన్నప్పుడు ఎక్కువ సేపు స్నానం చేస్తే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుందట. ఎక్కువ సమయం పాటు నీళ్లలో మునిగి ఉండడం వల్ల స్ట్రెస్, నొప్పులు, విపరీతమైన నీరసం తగ్గిపోతాయట. పూల రెక్కలతో పాటు నిమ్మకాయ, నారింజ తొక్కలు వేసుకోవడం వల్ల ఆ సువాసన మైండ్ ని రిలాక్స్ డ్ గా చేస్తుందని, అయితే బీర్ బాత్ చేసినప్పుడు అందులో వేడి నీళ్లు కలుపుకుంటే అందులో ఉన్న పోషకాలను శరీరం పీల్చుకుంటుంది అని చెబుతున్నారు. శరీరంపై ఉన్న టాక్సిన్స్ తో పాటు బ్యాక్టీరియాని ఇవి పూర్తిగా పోగొడతాయట.