HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Anti Inflammatory Foods Recommended By Doctors

Black Seed Oil: వామ్మో నల్ల జీలకర్ర నూనె వల్ల ఏకంగా అన్ని ప్రయోజనాలా.. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసా?

కేవలం నల్ల జీలకర్ర వల్ల మాత్రమే కాకుండా నల్ల జీలకర్ర నూనె వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 12-04-2025 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Seed Oil
Black Seed Oil

నల్ల జీలకర్ర గురించి మనందరికీ తెలిసిందే. ఈ నల్ల జీలకర్రను చాలా తక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నల్ల జీలకర్ర నూనెను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నూనెను ప్రతీ రోజు ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చట. కాగా ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ పసుపు, అల్లం కన్నా కూడా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుందని చెబుతున్నారు. కాగా శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు దాన్ని నయం చేసే మెకానిజం బాడీలోనే ఉంటుందట. సెల్ఫ్ హీలింగ్ శక్తి ఉన్న బాడీని అనవసరమైన ఆహారంతో పాడు చేసేసుకుంటాం. ముఖ్యంగా ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ క్రమంగా తగ్గిపోతూ ఉంటుందట. ఆ సమయంలో చిన్న గాయం అయినా సరే అది మానడానికి చాలా రోజుల సమయం పడుతుందట.

ఇది క్రమంగా ఇన్ ఫ్లమేషన్ కి దారి తీస్తుందని, ఇన్ ఫ్లమేషన్ అనేది ఒక సహజ ప్రక్రియ,ఏదైనా దెబ్బ తాకినప్పుడు శరీరం ఇలా స్పందిస్తూ ఉంటుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బాగుంటే త్వరగా గాయం నయం అయిపోయి ఈ ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోతుందట. లేదంటే అది క్రమంగా పెరిగి విపరీతంగా ఇబ్బంది పెడుతుందట. ముఖ్యంగా కీళ్లల్లో వాపు వస్తుందట. నడవడానికీ వీల్లేకుండా చేసేస్తుందట. ఇలా కీళ్ల నొప్పులతో బాధ పడే వాళ్లు రకరకాల మందులు వేసుకుంటూ ఉంటారు. వాటితో తాత్కాలిక ఉపశమనమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదట. పైగా ఇలా తరచూ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లేని పోని ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.

అందుకే సహజంగా ఈ నొప్పులను తగ్గించుకునే మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలున్న ఆహార పదార్థాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయట. అయితే పసుపు, అల్లం, బ్లూ బెర్రీ లాంటి పదార్థాల్లో ఈ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. అల్లం, పసుపు కన్నా కూడా యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలు ఎక్కువగా ఉండి, త్వరగా నొప్పులు తగ్గించగలిగే ఆహార పదార్థాలు ఉన్నాయట. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువగా వాడే మెడిసిన్ ఐబూప్రూఫెన్. ఈ మెడిసిన్ కన్నా కూడా నల్ల జీలకర్ర నొప్పులకు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుందట. అల్లం, పసుపు కన్నా కూడా 60 శాతం ఎక్కువగా కీళ్ల నొప్పులపై పని చేస్తుందని చెబుతున్నారు. ఈ నల్ల జీలకర్ర నూనెని బ్లాక్ సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఇందులో థైమోక్వినోన్ ఉంటుంది.

నొప్పులపై మెడిసిన్ ఎంత పని చేస్తుందో అంతకు ఎక్కువగానే పని చేస్తుందట. ఈ నల్ల జీలకర్ర నూనెని రోజూ ఒక టీ స్పూన్ మేర తీసుకున్నా ఇన్ ఫ్లమేషన్ సమస్య పై బాగా పని చేస్తుందట. కేవలం కీళ్ల నొప్పులకే కాదట. శ్వాస సంబంధిత సమస్యలు, అజీర్తి, చర్మ సమస్యలకు ఇది బాగా పని చేస్తుందట. బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలోను ఇది తోడ్పడుతుందట. ఆస్తమాని తగ్గించడంతో పాటు ఊపిరితిత్తుల పని తీరునీ మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్నీ అందంగా ఉంచుతాయట. యాక్నీ లాంటి సమస్యల్ని తగ్గిస్తాయి. వీటితో పాటు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. బ్లాక్ సీడ్ ఆయిల్ ని నేరుగా శరీరంపై రాసుకోవచ్చట. గాయాలు మానాలన్నా, యాక్నీ లాంటి సమస్యలు పోవాలన్నా నేరుగా ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవచ్చట. హెయిర్ లాస్ కి కూడా ఇది బాగా పని చేస్తుందట. బ్లాక్ సీడ్ ఆయిల్ ని తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయట. రక్త సరఫరా బాగా జరుగుతుందట. దీంతో పాటు బ్లాక్ సీడ్ ఆయిల్ ఉన్న షాంపూలు, కండీషనర్లను ఉపయోగించినా ఫలితం ఉంటుందట. ఇక జీర్ణ సంబంధింత సమస్యలు ఉంటే ఈ ఆయిల్ ని నేరుగా తాగవచ్చట. రోజూ ఒక టీ స్పూన్ మేర తీసుకుంటే సరిపోతుందట. బీపీని కంట్రోల్ చేయడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యల్నీ ఇది పోగొడుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Black Seed Oil
  • Black Seed Oil benefits
  • health tips

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

    • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

    Trending News

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd