Alzheimer: ఆ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే బీర్ తాగాల్సిందే?
ప్రస్తుతం కాలంలో మనుషులు లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి.
- By Nakshatra Published Date - 08:30 AM, Fri - 17 March 23

ప్రస్తుతం కాలంలో మనుషులు లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యాధుల కారణంగా కొంతమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ కొత్త కొత్త వ్యాధులు కారణంగా ఎంత డబ్బు సంపాదించినా కూడా హాస్పిటల్స్ ఖర్చులకే సరిపోతున్నాయి. కంటి నిండా నిద్ర కడుపునిండా భోజనం చేస్తే ఎటువంటి సమస్యలు రావు. కానీ ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ఈ రెండింటిని మర్చిపోయి అనవసరంగా లేనిపోని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి వాటిలో అల్జీమర్స్ వ్యాధి కూడా ఒకటి.
అల్జీమర్స్ అంటే మతిమరుపు. అల్జీమర్స్‌కు వ్యాధి బారిన ఎక్కువగా వయసు మీద పడిన వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే దీనికి మందు అంటూ ఏమీ ఉండదు. అల్జీమర్స్ వ్యాధి సోకే ప్రారంభ దశలో గుర్తించే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఇమేజింగ్ టెక్నిక్‌ను నిపుణులు కనుగొన్నారు. దానికి బీర్ తయారీలో వాడే హాప్ పూల ద్వారా చెక్ పెట్టవచ్చని వారు తెలిపారు. అంతేకాకుండా అల్జీమర్స్ వ్యాధి రాకుండా ముందస్తుగా ఏం చేయాలో అన్నది వైద్యులు వివరిస్తున్నారు. హాప్ పువ్వుల నుంచి సేకరించిన మూలకాలను అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ల సమూహాన్ని అడ్డుకోగలవు.
హాప్ పువ్వులతో తయారైన డ్రింక్స్ వాడితే అల్జీమర్స్ వ్యాధి నివారణ సాధ్యం అవుతుంది. అల్జీమర్స్ లక్షణాలను ముందుగా గుర్తించకుంటే ఆ తర్వాత చికిత్స ఇప్పించడం చాలా కష్టతరంగా మారొచ్చు. వీటిని ఏళ్లకు ఏళ్లు గుర్తించే అవకాశం చాలా తక్కువ. సాధారణంగా మనం అల్జీమర్స్ లక్షణాలను గుర్తించే టైంకు నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉండవచ్చును. దీంతో అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఫలితం గా మనుషులు తమ జ్ఞాపకశక్తిని కోల్పోతారు. తమ వారిని కూడా మర్చిపోతారు.

Related News

Beer Benefits: బీర్ తాగితే అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో,