AloeVera: కలబందతో వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కలబంద.. ఈ పేరు వినగానే చాలామంది అమ్మో కలబందన అంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకు గల కారణం
- By Nakshatra Published Date - 06:30 AM, Tue - 31 January 23

కలబంద.. ఈ పేరు వినగానే చాలామంది అమ్మో కలబందన అంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకు గల కారణం అందులో ఉండే చేదు స్వభావం. అయితే చాలామంది కలబంద కేవలం సౌందర్యానికి మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ కలబంద సౌందర్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కలబంద గుజ్జులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు ఎంతో బాగా సహాయపడతాయి. కలబంద జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది.
అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. మరి ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ తగ్గి కొత్త జుట్టు మొలవడానికి తోడ్పడుతుంది. కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడానికి సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది. కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టుకు లోపలి నుంచి పోషణను అందించడంతో పాటు జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. కలబంద జుట్టు నుంచి అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది. కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
దీంతో ఏవైనా గాయాలు అయినప్పుడు ఆ ప్రదేశంలో ఈ జెల్ అప్లై చేస్తే గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబంద ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియత్రణలో ఉంటాయి. అలాగే మలబద్దకం నుంచి ఉపశమం పొందవచ్చు. ఐస్ క్యూబ్ ట్రేలో అలోవెరా జెల్ వేసి ఉంచితే జెల్ క్యూబ్స్ తయారవుతాయి. వీటిని మీ ముఖంపై మృదువుగా రుద్దుకుంటే సహజ మెరుపును పొందవచ్చు.అలోవెరా జెల్‌ను మీ చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. దీని వలన చర్మం తేమగా మారుతుంది. కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.