Diet plan : ఆయుర్వేదం ఆధారంగా మారుతున్న కాలానికి 7 రోజుల ఆహార ప్రణాళిక..
ఇంట్లో తయారుచేసిన నెయ్యి, కూరగాయల సూప్‌లు, ఆకుకూరలు , బాదం వంటి ప్రోటీన్ యొక్క సహజ వనరును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ మధుమిత కృష్ణన్సి ఫార్సు చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 02:37 PM, Mon - 31 March 25

Diet plan : మనం శీతాకాలం నుండి వసంతకాలం (సంధి కాల) కు మారుతున్నప్పుడు, కాలానుగుణ అనారోగ్య సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఆయుర్వేదం చెబుతుంది. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు జీర్ణక్రియను బలహీనపరుస్తాయి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.
ఈ దశలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సరి అయిన ఆహరం తీసుకోవడం అవసరం. ఆయుర్వేద నిపుణులుగా, ఇంట్లో తయారుచేసిన నెయ్యి, కూరగాయల సూప్‌లు, ఆకుకూరలు , బాదం వంటి ప్రోటీన్ యొక్క సహజ వనరును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ మధుమిత కృష్ణన్సి ఫార్సు చేస్తున్నారు.
ఏడు రోజుల ఆయుర్వేద ఆహారం సీజన్ తో పాటుగా వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతూ పోషకమైన, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడుతుంది. ఈ దిగువ ప్రభావవంతమైన భోజన ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత అవసరాల ఆధారంగా మీరు తీసుకునే ఆహరం సర్దుబాటు చేసుకోవడానికి సంకోచించకండి.
ఏడు రోజుల ఆయుర్వేద ఆహార ప్రణాళిక
మొదటి రోజు
అల్పాహారం: పెరుగుతో మెంతి థెప్లా
లంచ్: పాలక్-పనీర్ కర్రీతో జొన్న రోటీ, తాజా కూరగాయల సలాడ్ , కొన్ని కాలిఫోర్నియా బాదం.
డిన్నర్: నెయ్యి, జీలకర్ర , నల్ల మిరియాలతో ఉడికించిన మూంగ్ దాల్ ఖిచ్డి, ఉడికించిన బీట్‌రూట్ , క్యారెట్ సబ్జీ .
2వ రోజు
అల్పాహారం: వేయించిన బాదం , చిటికెడు అల్లం , దాల్చిన చెక్కతో మసాలా ఓట్స్ గంజి.
భోజనం: రజ్మా కర్రీతో జీరా రైస్, ఆకుకూరలు
డిన్నర్ : లవంగాలు , మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన బజ్రా కిచిడి, బీట్‌రూట్ రైతా.
3వ రోజు
అల్పాహారం: వెచ్చని బాదం పాలతో ఇంట్లో తయారుచేసిన ముస్లీ, బాదం , అంజీర్ పండ్లు. / నెయ్యితో క్యారెట్ పరాఠా.
లంచ్ : చనా మసాలాతో గోధుమ చపాతీ, సీజనల్ వెజిటబుల్ సలాడ్ ప్లేట్, కొన్ని బాదం
డిన్నర్: రైస్ తో క్యారెట్-అల్లం సూప్ , కూరగాయల వేపుడు .
4వ రోజు
అల్పాహారం: పుదీనా చట్నీతో బేసన్ చిల్లా.
లంచ్ : మునగకాయ సాంబార్‌తో రైస్ , ఉడికించిన ఆకుకూరలు మరియు బాదం
రాత్రి భోజనం: కొబ్బరి పాలు, నల్ల మిరియాలు యాలకులతో కూరగాయల వంటకం, హోల్ వీట్ బ్రెడ్‌తో కలిపి తినవచ్చు
5వ రోజు
అల్పాహారం: నల్ల మిరియాలు , నెయ్యితో మిల్లెట్ ఉప్మా .
లంచ్: పెసర పప్పు కూర, ఉడికించిన టర్నిప్‌లు , క్యారెట్లు , బాదం తో గోధుమ చపాతీ.
డిన్నర్: నల్ల మిరియాలు, జీలకర్ర , నెయ్యితో ఉడికించిన దాల్ కిచ్డీ, మసాలా దినుసులు కలిపిన బీట్‌రూట్ రైతాతో తినవచ్చు .
6వ రోజు
అల్పాహారం: నెయ్యి, బెల్లం, బాదం మరియు యాలకులతో తయారు చేసిన వెచ్చని క్షీర/ పెరుగు మరియు బాదంతో మెంతి థెప్లా.
లంచ్: కారంగా ఉండే మునగకాయ కూరతో బజ్రా రోటీ, తాజా కూరగాయల సలాడ్ , బాదం పిండి కుకీలు. రాత్రి భోజనం: ఉడికించిన పాలకూర , గోధుమ రొట్టెతో శనగపిండి చీలా .
7వ రోజు
అల్పాహారం: పసుపు మరియు నల్ల మిరియాలతో వండిన పోహా .
మధ్యాహ్నం: మెంతి సెనగలు కూర తో గోధుమ రోటీలు, తాజా సలాడ్, కొన్ని బాదం .
విందు: ఉడికించిన ఆకుకూరలు , పప్పు సూప్, రైస్
మీ భోజనాన్ని ఎలా రూపొందించుకోవాలి
మీ వ్యక్తిగత అవసరాలు , ప్రాధాన్యతల ఆధారంగా ఎల్లప్పుడూ మీ భోజనం ఎంచుకోండి.
సమతుల్య భోజనం కోసం ఆరు రుచులను (తీపి, పులుపు , ఉప్ప, చేదు, ఘాటు మరియు వగరు ) చేర్చండి.
ఈ సరళమైన ఆయుర్వేద ఆహార ప్రణాళికను అనుసరించడం ద్వారా, మీరు మీ జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కాలానుగుణ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.