HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Dont You Do Auspicious Deeds In Shunyamasam

Shunyamasam : శూన్య మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

సూర్య మానం ప్రకారం, చాంద్ర మానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-12-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shunyamasam
Soonya Masam

శూన్య మాసం (Shunyamasam) ముహూర్తాలు లేవు, ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా.. ఎందుకు..అసలు శూన్య మాసం (Shunyamasam) అంటే ఏంటి? సూర్య మానం ప్రకారం, చాంద్ర మానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్య మానం ప్రకారం ధనుర్మాసం – చాంద్ర మానం ప్రకారం పుష్య మాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసం మొత్తం  శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తం కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్య మాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్య మాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.

మీన మాసంతో కూడిన చైత్ర మాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. ఈ కాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్య మాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని చెబుతారు. పితృ కార్యాలు మాత్రం శూన్య మాసంలో చేయవచ్చు.

చంద్ర మానం ప్రకారం తెలుగు నెలలు:

హిందువులకు చాంద్ర మానము సూర్య మానమని రెండు రకాల కాలమానాలు (క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్ర మాన మాసాలు ఏర్పడతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. శుక్ల పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఒక నెలగా పరిగణిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసంగా పరిగణిస్తారు. పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు.

సూర్య సంచారం ఆధారంగా రాశుల పేర్లతో నెలలు:

సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం రుతువులకు సామీప్యంగా ఉంటుంది.

Also Read:  Jupiter : గురు గ్రహ ఫలాలు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Auspicious Deeds
  • Deeds
  • devotional
  • Shunyamasam
  • Why?

Related News

Hanuman Jayanti 2026

Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయు

  • PM Modi at Somnath Amrut Mahotsav

    Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd