HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Which Way Should We Sit And Eat Eating Habits In India

Eating Habits : మనం ఏ దిక్కున కూర్చుని భోజనం చేయాలి?

భారతీయ (India) జీవన విధానంలో ప్రతి చిన్న విషయం కూడా శాస్త్రబద్ధమే. ఇంటి నిర్మాణం,

  • Author : Vamsi Chowdary Korata Date : 24-12-2022 - 2:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Eating Habits
Eating Habits

భారతీయ జీవన విధానంలో ప్రతి చిన్న విషయం కూడా శాస్త్రబద్ధమే. ఇంటి నిర్మాణం, గదుల అమరిక, గుమ్మాలు, కిటికీలు, దిక్కులు, మూలలు వంటి విషయాలు మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాస్తు నియమబద్ధంగా వివరిస్తుంది. వంటగది ఏమూలన ఉండాలో అని మాత్రమే కాదు.. వంట చేయడం, వడ్డించడం వరకు చాలా విషయాలను చర్చిస్తుంది. అయితే, నియమాలను కొందరు అస్సలు పట్టించుకోరు. చాలామందికి వాటిపై పెద్దగా అవగాహన కూడా ఉండదు. ఫలితంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు.

నేటి జీవన శైలిలో ఆహారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కడో నిలబడి, ప్రయాణం చేస్తూ ఇలా రకరకాల స్థితుల్లో మొక్కుబడిగా భోజనాలు కానిచ్చేవారు (Eating) కోకొల్లాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే. ఆకలిగా ఉంటే అన్నం కావల్సిందే. ఆకలి తీర్చే అన్నానికి ఎవరైనా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. నియమబద్ధంగా ఆహారం తీసుకుంటే అది ఇంటికి శుభాన్ని, ఇంట్లోని వ్యక్తులకు ఆరోగ్యాన్ని సిరిసంపదలు వద్దన్నా వస్తాయి. భోజనానికి (Eating) సంబంధించి వాస్తు చెప్తున్న కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం.

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి?

🍜 భోజనం చేసేందుకు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా కూర్చొని ఎప్పుడూ భోజనం  చెయ్యకూడదు. ఎందుకంటే దక్షిణం యమస్థానం. ఇది మృత్యువుకు సంకేతం. కనుక అటువైపు తిరిగి తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు.

🍜 భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను దైవ ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. భోజనం ముగించిన తర్వాత పశువులకు లేదా పక్షులకు లేదా చీమలు వంటి కీటకాలకు పెట్టాలి. ఇది అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు చక్కని మార్గం.

🍜 భోజన సమయంలో గ్లాసులో నీళ్లు ఎప్పుడూ కుడి వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే సదా శుభాలు కలుగుతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది. సమృద్ధిగా కూడా ఉంటుంది.

🍜 భోజనం తర్వాత ప్లేట్ లో ఎప్పుడూ చేతులు కడగకూడదు. ఇలా చెయ్యడమంటే దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. సంపద నశిస్తుంది. ఇంట్లోని ఆనందం, శాంతి పోతాయి.

🍜 భోజనం ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన పళ్లెంలోనే చెయ్యాలి. అలా చెయ్యకపోతే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఆమె అలిగి వెళ్లి పోతుంది. ఫలితంగా తిండికి అలమటించాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది.

🍜 పచ్చని ఆకులో భోంచెయ్యడం శుభప్రదం, ఇలా ఆకుపచ్చని ఆకులో భోజనం వడ్డించుకుని భోజనం చేస్తే దేవి అన్నపూర్ణ ఆనందిస్తుంది. అందుకే దేవుడికి నైవేద్యం పచ్చని ఆకులో వడ్డించాలని చెబుతారు.

🍜 వెండి పళ్లెం భోజనానికి ఉపయోగించేట్టయితే తప్పనిసరిగా పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉండాలి. అలా లేని వెండి పళ్లెం భోజనానికి పనికిరాదు.

🍜 భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా దరిద్రానికి చిహ్నం.

ఈ చిన్న చిన్న నియమాలు పాటించి భోంచేస్తే ఆరోగ్యం, ఆనందం, సంపద మీ వెంటే ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Also Read:  Venkateswara Swamy : వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం – దర్శన సమయాలు, చరిత్ర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • Eating
  • Habits
  • india
  • Position
  • Which Direction

Related News

Rudraksha

Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

హిందూ విశ్వాసం ప్రకారం, రుద్రాక్ష పరమ శివుడి కన్నీటి నుండి ఉద్భవించింది. అందుకే ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుని అనుగ్రహం పొందడానికి ప్రజలు తరచుగా రుద్రాక్షలు ధరించడం కనిపిస్తుంది. రుద్రాక్ష దేవతలకు, నవగ్రహాలకు సంబంధించినది. దీనితో పాటు రుద్రాక్షను ధరించే ముందు తప్పనిసరిగా పూజించాలని చెబుతారు. రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. కావున మీ రాశిని బట్టి రు

    Latest News

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd