Tirumala: తిరుమల శ్రీవారిని ఏ రోజున దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
తిరుమల శ్రీవారిని వారంలో ఒక్కొక్క రోజు దర్శించుకోవడం వల్ల ఒక్కో విధమైన ఫలితాలు కలుగుతాయట.
- By Anshu Published Date - 03:00 PM, Sun - 15 September 24

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. పండుగ, పాట అనే సమయం లేకుండా నిత్యం తిరుమలలో భక్తులు ఉండనే ఉంటారు. అంతేకాకుండా వేలాదిమంది భక్తులతో నిత్యం తిరుమల కిటకిట లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించడంతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. వారాలతో, వర్జ్యాలతో ఎలాంటి సంబంధం లేకుండా స్వామివారిని కనులారా వీక్షించేందుకు బారులు తీరుతుంటారు.
అంతా బాగుంది కానీ తిరుమల శ్రీవారిని ఒక్కొక్క రోజు దర్శించుకోవడం వల్ల ఒక్కో విధమైన మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం రోజు స్వామి వారిని దర్శించుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందట. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడంతో పాటు రాజకీయం పురోగతి కూడా లభిస్తుందట. అలాగే సోమవారం స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందట. దీర్షకాలిక అనారోగ్య సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. అలాగే పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైన తగ్గుతాయని చెబుతున్నారు. ఇక మంగళవారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వల్ల రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చట.
అలాగే సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే మంగళవారం దర్శించుకోవాలని చెబుతున్నారు. అలాగే స్వామి వారిని బుధవారం దర్శించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుందట. చిన్న పిల్లలకు మంచి విద్య లభిస్తుందని చెబుతున్నారు. చదువులో వెనకబడిన పిల్లలు బుధవారం స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని కూడా చెబుతున్నారు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహ సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయట. వయస్సు మీద పడుతున్నా వివాహం కాని వారు ఎందరో ఉన్నారు. గురువారం స్వామివారిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. పిల్లలు కానీ వారు కూడా ఈ రోజు స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే రోజు స్వామిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. అద్రుష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఇంట్లో కనక వర్షం కురస్తుందని చెబుతున్నారు. అలాగే శనివారం రోజున ఈరోజు వడ్డీ కాసుల వాడిని దర్శించుకంటే నవగ్రహ దోషాలు తొలగుతాయట. ఆకలి బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.