HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Welcome The New Year With These Devotional Verses

కొత్త సంవత్సరం లో ఇలా భక్తి శ్లోకాలతో స్వాగతం చెప్పేయండి!

  • Author : Vamsi Chowdary Korata Date : 31-12-2025 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

Happy New Year Wishes 2026 : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. New Year 2026 సెలబ్రేషన్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త ఆశలు, ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తి శ్లోకాలతో వెరైటీగా శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

సంవత్సరానికి సెండాఫ్ ఇచ్చేసి.. 2026 నూతన సంవత్సరానికికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు.. సరికొత్త ఆలోచనలు, ఆశయాల కలబోత! త్వరలో రాబోయే నూతన సంవత్సరం 2026లో ఆటంకాలు తొలగిపోయి జీవితం అద్భుతంగా, ఆనందంగా ముందుకు సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే.. ఈ కోరికలను గతంలో గ్రీటింగ్ కార్డుల రూపంలో వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. అంతా డిజిటల్మయం కావడంతో.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Wishes 2026) చెబుతున్నారు. అయితే.. మీరు రొటీన్గా హ్యాపీ న్యూ ఇయర్ 2026 (Happy New Year 2026) అని కాకుండా.. హృదయాన్ని హత్తుకునేలా మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పేయండి. విద్య ఉద్యోగం, ఆరోగ్యం (Health), ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం కలిసొచ్చేలా భగవంతుడిని ప్రార్థిస్తూ ఇలా శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి..

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

 

Vinayaka

Vinayaka

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
వక్ర తొండము, మహా శరీరంతో కోటి సూర్యుల వలె ప్రకాశించే ఆ వినాయకుడు.. మీరు చేపట్టే పనులన్నింటినీ ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Vinayaka..

Vinayaka..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
తెల్లని వస్త్రాలు ధరించిన విష్ణు స్వరూపుడైన చంద్రుని వంటి వర్ణం గల నాలుగు భుజాలు కలిగిన ప్రసన్నమైన ముఖంతో ఉండే ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల విఘ్నాలు అన్నీ తొలగిపోయి విజయం కలగాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Venkateswara Swamy

Venkateswara Swamy

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం హైమోర్ధ్వపుండ్ర మజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండమ్ బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తామ్ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసమ్ శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి శ్రీవెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మీకు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Venkateswaraswamy

Venkateswaraswamy

 

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2026

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Sri Krishna

Sri Krishna

 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Srikrishna

Srikrishna

 

హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
మీకు మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్‌ 2026 శుభాకాంక్షలు

 

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు 2026

Lord Shiva With Family

Lord Shiva With Family

 

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారూకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
మీకు మీ కుటుంబసభ్యులకు న్యూ ఇయర్‌ 2026 శుభాకాంక్షలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • new year
  • New Year Wishes
  • Nutana Samvatsara Subhakankshalu

Related News

Putrada Ekadashi

రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

ఒకరోజు దుఃఖంతో నిండిన మనసుతో రాజు తన రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది మునులు అతనికి తారసపడ్డారు. రాజు తన బాధను ఆ మహర్షులకు వివరించాడు.

  • Dasa Copy

    అనంత విశ్వానికి మూలమైన అమ్మవారి (dasa mahavidya) దశ మహా విద్యలు ఇవే!

Latest News

  • అసలు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?..దీన్ని ఎవ‌రు తిన‌కూడ‌దు..?

  • బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

  • కొత్త ఏడాదికి వాట్సప్‌ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు

  • జాతీయ రహదారుల విస్తరణతో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌

  • మెటా మరో భారీ అడుగు: ఏఐ స్టార్టప్ ‘మానుస్’ కొనుగోలు

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

    • డిసెంబర్ 31లోపు మ‌నం పూర్తి చేయాల్సిన ముఖ్య‌మైన‌ పనులు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd