Weekly Horoscope: జనవరి 27 టు ఫిబ్రవరి 2 రాశిఫలాలు.. ఆ రాశుల వారి జీవితంలో కుదుపులు
ఈవారం మేష రాశివారికి మంచి టైం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని మంచి అవకాశాలు(Weekly Horoscope) లభిస్తాయి.
- By Pasha Published Date - 10:06 AM, Mon - 27 January 25

Weekly Horoscope: రాశిఫలాలు అనేవి ప్రతిరోజూ మారుతాయి. ఫలితంగా ఒక్కో రోజులో ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తుంటాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. రాశిఫలాలు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Hyderabad ORR Lease : కారుచౌకగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు.. ఐఆర్‌బీకి 16 నెలల్లోనే రూ.1000 కోట్లు
మేష రాశి వారఫలం
ఈవారం మేష రాశివారికి మంచి టైం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని మంచి అవకాశాలు(Weekly Horoscope) లభిస్తాయి. వాటిని తెలివిగా అందిపుచ్చుకోవాలి. ఈక్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అత్యాశకు పోవద్దు. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకండి. మీకు దశమంలో రవి బలం ఉంది. జాబ్‌లో ప్రమోషన్ రావచ్చు.
వృషభ రాశి
వారఫలం
ఈవారం వృషభరాశి వారికి దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు. అందుకే కొన్ని పనుల్లో, ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే ముఖ్య నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. అవసరమైతే నిపుణులు, నమ్మకస్తుల సలహాలను తీసుకోవాలి. అప్రమత్తంగా లేకుంటే వ్యాపారంలో నష్టం జరగొచ్చు. వృథా ఖర్చులను పూర్తిగా ఆపేయండి.
Also Read :Big Pushpas : బిగ్ ‘పుష్ప’లు.. రహస్య స్థావరాల్లో భారీగా ఎర్రచందనం దుంగలు!
మిథున రాశి వారఫలం 
ఈవారం మిథున రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు రావచ్చు. అయితే వాటి గురించి అతిగా ఆలోచించి కలత చెందకండి. ఓపిగ్గా, ప్రణాళికతో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వొద్దు. మానసిక ఒత్తిడిని దరిచేరనివ్వొద్దు. సమయ స్ఫూర్తితో మీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలను తప్పక విశ్లేషించుకోండి. అవి బాగుంటే అమలు చేయండి. ఉద్యోగాల్లో ఉన్నవారు మంచి పేరు తెచ్చుకుంటారు.
కర్కాటక రాశి వారఫలం
ఈవారం కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. వాటిని చూసి బెంగ పడొద్దు. ప్రతికూల అంశాలను గుర్తించి, వాటిని సానుకూల అంశాలుగా ఎలా మార్చుకోవాలనే దానిపై ధ్యాస పెట్టండి. భవిష్యత్తు మీదే అవుతుంది. మానసిక ఒత్తిడికి లోనైతే సరైన ఆలోచనలు రావు. సప్తమంలో బుధుడు ఉన్నాడు.
సింహరాశి వారఫలం
ఈవారం సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా, నేర్పుతో వాటిని అధిగమిస్తారు. ఈక్రమంలో సీనియర్లు, నిపుణులు, సన్నిహితుల సూచనలు బాగా పనికొస్తాయి. తొందరపాటుతో ఏవిషయాన్నీ మాట్లాడకండి. ఆలోచించకుండా ఖర్చులు కూడా చేయకండి.
కన్యరాశి వారఫలం
ఈవారం కన్యరాశి వారికి పంచమంలో బుధుడు ఉన్నాడు. అందుకే వ్యాపారంలో లాభనష్టాలు సరిసమాన స్థాయిలో వస్తాయి. వాస్తవానికి వ్యాపారం కొంత నెమ్మదిస్తుంది. అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం బెటర్. వ్యాపారంలో లాభనష్టాలు సర్వసాధారణం అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
తులరాశి వారఫలం
ఈవారం తులరాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మానసిక బలంతో, ఆత్మ విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. చిన్నపాటి నష్టాలకే భయపడిపోవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మానసిక స్థైర్యంతో అడుగులు వేయండి. మీ పెట్టుబడులు కలిసొస్తాయి. మీకు లాభాలను సంపాదించి పెడతాయి.
వృశ్చిక రాశి వారఫలం
ఈవారం వృశ్చిక రాశి వారు వ్యాపార వ్యవహారాల్లో కొన్ని కుదుపులకు గురవుతారు. అయినా అధైర్యానికి గురికావద్దు. నైతిక విలువలతో, ఆర్థిక క్రమశిక్షణతో, ఫ్యూచర్ విజన్‌తో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లండి. ఈక్రమంలో కుటుంబీకుల సహాయ సహకారాలు తీసుకోండి. నమ్మకస్తుల చేయిని వదలొద్దు.
ధనుస్సు రాశి వారఫలం
ఈవారం ధనుస్సు రాశి వారు కొన్ని గొడవల్లో ఇరుక్కునే ముప్పు ఉంది. అందుకే ఏదైనా గొడవ జరుగుతుంటే దాని మధ్యలోకి దూరొద్దు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఓపిక అవసరం. కోపం మంచిది కాదు. వాహనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతివేగం వద్దు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటే లాభాలు వస్తాయి.
మకర రాశి వారఫలం
ఈవారం మకర రాశివారి కొన్ని సమస్యలు తీరుతాయి. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ఇంకా అప్పులు మిగిలి ఉంటే శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి. ఏదైనా పెద్ద సమస్య ఎదురైతేే భయపడకుండా నిర్ణయం తీసుకోండి. సాహసంగా ముందుకు సాగండి. అయితేే కోపం, అహంభావం పనికి రావు. ప్రతీ పనికి ముందస్తు ప్రణాళిక ఉండి తీరాల్సిందే.
కుంభ రాశి వారఫలం
ఈవారం కుంభరాశి వారు కొన్ని కుటుంబ వివాదాలను ఎదుర్కొంటారు. కోపం దరిచేరనివ్వొద్దు. సంయమనంతో వ్యవహరించండి. కుటుంబంలోని వారికి దూరం కావొద్దు. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరు పడితే వారి సలహాలను నమ్మొద్దు. మీ సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి.
మీనరాశి వారఫలం
ఈవారం మీనరాశిలోని ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దూకుడు వద్దు. నిర్ణయాలు మెల్లగా తీసుకోండి. ఏదైనా సమస్య వస్తే తీరడానికి కొంత సమయం పడుతుందని గుర్తుంచుకోండి. వ్యాపారంలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు మంచి జాబ్ ఆఫర్లు వస్తాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.