Tulasi Puja: కష్టాలతో సతమతమవుతున్నారా.. అయితే తులసి చెట్టును ఈ విధంగా పూజించండి?
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పూజిస్తూ దేవతగా కొలుస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందూ మతంలో
- By Anshu Published Date - 06:30 AM, Tue - 25 October 22

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పూజిస్తూ దేవతగా కొలుస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. తులసి మొక్కను చాలామంది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అందుకే చాలామంది స్త్రీలు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కను పూజించడం వల్ల సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్య పెరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ కష్టాలతో బాధపడుతున్నట్లయితే ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి తులసి మొక్కను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఆదివారం రోజు తులసి మొక్కకు పాలు సమర్పించి తులసి కోట ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరక పోతే అప్పుడు ఆ అమ్మాయితో తులసి మొక్కకు పూజ చేయించి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు పోసి తులసి మొక్కకు మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి. తులసి మొక్కను ఇంట్లో ఎప్పుడు ఆగ్నేయ దిశలో నాటాను. అలాగే క్రమం తప్పకుండా తులసి మొక్కకు పూజ చేయడంతో పాటు తులసి కోట ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
ఈ విధంగా చేయడం వల్ల కష్టాల పోయి సంతోషంగా ఉంటారు. అదేవిధంగా నీటితో నింపిన ఒక ఇత్తడి పాత్రలు 4 లేదా 5 తులసి ఆకులను వేసి 24 గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మొదటి రోజు తల స్నానం చేసి ఆ నీటిని ప్రధాన ద్వారం తో పాటు ఇంటి లోపల అంతటా చల్లడం వల్ల కష్టాలు అన్ని తొలగి మంచి రోజులు వస్తాయి..