Vasthu Tips: పడుకునే ముందు అలాంటి పనులు చేస్తున్నారా.. దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే!
రాత్రి పడుకునే సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే వాటికి కారణం కావచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Sun - 3 November 24

ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఎలాంటి పనులు చేసినా కూడా కలిసి రాకపోవడంతో పాటు సంపాదించిన డబ్బు కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అవుతుందట. వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల కోటీశ్వరులు కూడా భిక్షాటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వాస్తు చిట్కాలు వాస్తు విషయాలు జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటికే పరిమితం కాకుండా రోజువారి చేసే పనుల్లో కూడా భాగమైంది. రోజువారి జీవితంలో అనేక పనుల్లో వాస్తు దాగి ఉంది. అందుకే వాస్తు ప్రకారం చేయని పనులన్నీ నిర్విఘ్నంతో ఆగిపోతూ ఉంటాయి.
అయితే కొన్ని వాస్తు విషయాలపై జాగ్రత్త వహించి పనులు చేస్తే సులభంగా విజయాలు సాధించడమే కాకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయట. కొంతమంది ప్రతిరోజు పడుకునే దిండు కింద పర్సు లేదా డబ్బులను పెట్టుకొని పడుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం పెద్ద తప్పు అని చెబుతున్నారు. ఇలా చేస్తే అదృష్టం తొలగిపోయి దురదృష్టం వచ్చే అవకాశాలు ఉంటాయట. చాలామంది నిద్రపోయే క్రమంలో ఏదో ఒకటి చదువుతూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు సర్వసాధారణంగా చాలా మందికి ఉంటుంది అయితే చదువుకుంటూ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఆ పుస్తకం అక్కడే బెడ్ పై ఉంటుంది.
వీటిని నెమ్మదిగా దిండు కిందికి జరుపుకొని కూడా పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం మంచిది కాదట. కొంతమంది నిద్రపోయే సమయంలో పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని కూడా పడుకుంటారు. నిద్రలో దాహం వేసినప్పుడు తాగాలని అనుకుంటారు. నిజానికి వాస్తు ప్రకారం నీటిని పక్కన పెట్టుకొని పడుకోవడం అంత మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కూడా అదృష్టం చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయని కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.