Vastu Tips: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇక డబ్బే డబ్బు?
Vastu Tips: ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇళ్లతో పాటు ఆఫీసులలో అలాగే వ్యాపారం చేసే ప్రదేశాలలో కూడా ఈ మనీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు.
- By Nakshatra Published Date - 06:30 AM, Wed - 12 October 22
Vastu Tips: ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇళ్లతో పాటు ఆఫీసులలో అలాగే వ్యాపారం చేసే ప్రదేశాలలో కూడా ఈ మనీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటిని అందంగా ఉంచడంతోపాటు వాస్తు పరంగా కూడా ఇది ఇంట్లో శ్రేయస్సును కొనసాగించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే మనీ ప్లాంట్ ని పెంచితే సరిపోదండోయ్. మనీ ప్లాంట్ ని పెంచినప్పుడు వాస్తు ప్రకారం గా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మొక్క ఇంట్లో పెరుగుతున్నప్పుడు దాని తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. ఆ మొక్క పెరుగుతున్నప్పుడు దానికి తాడు లాంటిది కట్టి పైకి విస్తరించేలా చేయాలి. మనీ ప్లాంట్ ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆ మొక్క పెరిగితే అభివ్యక్తి అని చెబుతూ ఉంటారు. అలాగే ఎండిన మనీ ప్లాంట్ చెట్టును నాశనానికి సంకేతంగా చెబుతూ ఉంటారు. మనీ ప్లాంట్ చెట్టు ఎండిపోకుండా ఉండాలి అంటే తరచుగా ఆ చెట్టుకు నీరు పోస్తూ ఉండాలి ఆకులు ఎండిపోవడం ప్రారంభిస్తే అటువంటిప్పుడు వెంటనే ఆకులను కత్తిరించడం మొదలుపెట్టాలి.
అలాగే మనీ ప్లాంట్ ను ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో నాటకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం వస్తుంది. మనీ ప్లాంట్ ను ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో ఉంచాలి. మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో పెంచడం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు అప్పగించకూడదు. ఇలా చేయడంవల్ల మీరే మీ చేతులతో మీ సంపదను మరొకరికి ఇచ్చినట్టు అవుతుంది. ఈ మనీ ప్లాంట్ చెట్లను ఎప్పుడు ఇంటి లోపల మాత్రమే ఉంచుకోవాలి. అయితే ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి, దీనిని ఇంటి లోపల ఉంచాలి. ఇంటి బయట మనీ ప్లాంట్ నాటడం వాస్తు ప్రకారం అశుభం. ఇది ఎండలో త్వరగా ఎండిపోతుంది. పెరగదు. మొక్కల ఎదుగుదల మందగించి ఇంటికి దురదృష్టాన్ని కలిగిస్తుంది.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.