HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Tomorrow Is Diwali Dont Forget These Things

Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తెలియక చేసే చిన్న పొరపాట్లు కూడా అశుభాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.

  • Author : Gopi Date : 19-10-2025 - 12:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diwali
Diwali

Diwali: దీపావళి (Diwali) పండుగ అంటే కేవలం టపాసులు, పిండివంటలు మాత్రమే కాదు. ఇది పవిత్రత, సంస్కృతికి ప్రతీక. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆచరించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలు, పద్ధతుల గురించి పండితులు వివరిస్తున్నారు. తెల్లవారుజామునే స్నానం చేయడం నుండి దీపారాధనలో వత్తుల సంఖ్య వరకు ఉన్న విశిష్టతలను తెలుసుకుందాం.

దీపావళి రోజున తెల్లవారుజాము స్నానం

దీపావళి రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పండితుల సూచనల ప్రకారం.. సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలి. ఈ స్నానానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. “నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ రోజున (దీపావ‌ళ) చేసే స్నానం వల్ల గంగా స్నాన ఫలం లభిస్తుంది” అని పెద్దలు చెబుతున్నారు. స్నానం పూర్తయిన తర్వాత తెలుపు వస్త్రాలు ధరించి, మినప ఆకు, మినపప్పుతో చేసిన వంటకాలను తినడం శుభకరం. ఈ నియమాలు పాటించడం వల్ల ఏడాది పొడవునా శుభాలు కలుగుతాయని విశ్వాసం.

Also Read: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

దీపారాధనలో ఐదు వత్తుల ప్రాధాన్యం

దీపావళి దీపారాధనలో ఉపయోగించే వత్తుల సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంటి గృహిణి స్వయంగా దీపం వెలిగించేటప్పుడు కుందిలో 5 వత్తులు ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఐదు వత్తులు కుటుంబంలోని ఐదు ముఖ్య అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయని చెబుతున్నారు.

  1. మొదటి వత్తి: భర్త, సంతానం క్షేమం కోసం.
  2. రెండో వత్తి: అత్తమామల శ్రేయస్సు కోసం.
  3. మూడో వత్తి: తోబుట్టువుల క్షేమం కోసం ఉద్దేశించినవి.
  4. నాల్గో వత్తి: గౌరవం, ధర్మ వృద్ధిని సూచిస్తుంది.
  5. ఐదో వత్తి: వంశాభివృద్ధిని సూచిస్తుంది.

దీపాలు పెట్టేటప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు

దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తెలియక చేసే చిన్న పొరపాట్లు కూడా అశుభాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.

  • తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించకూడదు.
  • బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు.
  • దీపం వెలిగించే సమయంలో మౌనం పాటించాలి.
  • జ్యోతిని ఏక హారతితో (ఒకే అగ్గిపుల్ల లేదా వెలిగించిన వత్తితో) వెలిగించడం ఉత్తమం.
  • ఒకే వత్తిని ఉపయోగించకూడదు. రెండు లేదా మూడు వత్తులతో దీపాలు పెట్టడం శుభకరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • devotional news
  • Diwali 2025
  • diwali special
  • festivals

Related News

Hanuman Jayanti 2026

Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయు

  • PM Modi at Somnath Amrut Mahotsav

    Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Latest News

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd