Ganesh: వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే విగ్నేశ్వరుడిని ఈ విధంగా పూజించాల్సిందే!
వ్యాపారం సరిగా జరగడం లేదు అని దిగులు చెందుతున్న వారు తప్పనిసరిగా విఘ్నేశ్వరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Sat - 28 December 24

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో విఘ్నేశ్వరుడు కూడా ఒకరు. విఘ్నేశ్వరుడికి బుధవారం రోజు అంకితం చేయబడింది. రోజున విఘ్నేశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. కాగా నవగ్రహాలలో బుద్ధిని జ్ఞానాన్ని,వ్యాపార అభివృద్ధిని ప్రసాదించే గ్రహం బుధుడు. బుద్ధునికి అది దేవుడు వినాయకుడు. అందుకే బుధవారం రోజు విగ్నేశ్వరున్ని పూజిస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని చెబుతున్నారు. బుధవారం రోజు చేసే కొన్ని రకాల పరిహారాలతో గణపతి అనుగ్రహం కలుగుతుందట. జ్ఞానం లభిస్తుందట.
ముఖ్యంగా వ్యాపారంలో అఖండ విజయం పడుతుందట. బుధవారం రోజు ఏ ఇంట అయితే విశేషంగా విఘ్నేశ్వరుడుని పూజిస్తారో ఆ ఇంట సిరి సంపదలు సుఖసంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. ప్రతి బుధవారం ఉదయాన భక్తి శ్రద్ధలతో పూజా మందిరంలో గణేశుని ముందర గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించాలట. తరువాత వినాయకునికి బెల్లం నివేదించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన కుటుంబ శ్రేయస్సు ఉంటుందట. ప్రతి బుధవారం సిద్ధి గణపతికి గరిక సమర్పించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే కార్యసిద్ధి ఉంటుందట. ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఇక వ్యాపారంలో సానుకూలత కోసం అలాగే అధిక లాభాల కోసం బుధవారం లక్ష్మీ గణపతికి మోదకాలు సమర్పించాలట.
విద్యార్థులు చదువులో చక్కగా రాణించి విజయాలు సాధించాలి అంటే ప్రతి బుధవారం ఉచ్చిష్ట గణపతికి ఉండాలను సమర్పించాలని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం సిద్ధించాలని కోరుకునే వారు బుధవారం రోజు సింధూర గణపతి అభిషేకం అర్చన జరిపించుకోవాలని చెబుతున్నారు. కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంకట విమోచన గణపతికి 5 కొబ్బరి కాయలు, జిల్లేడు పూలు సమర్పిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే 11 బుధవారాలు వినాయకుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, బిల్వ దళాలు, కొబ్బరికాయ, అరటి పండ్లు వినాయకుడికి సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.