TTD: తిరుమల వెళ్తున్న భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
TTD: వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ముందుగానే ఆన్‌లైన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారు, అలాగే సాధారణ క్యూ లైన్లలో వచ్చిన భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో రద్దీ ఎక్కువైందని అధికారులు వెల్లడించారు.
- By Sudheer Published Date - 10:45 AM, Sat - 16 August 25

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు (Tirumala Devotees) భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారాంతపు సెలవులు రావడంతో తిరుమల కొండంతా భక్తులతో నిండిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లు ఏర్పడి ఉన్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే 77,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.53 కోట్లకు చేరింది.
భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి రావడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తోంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ముందుగానే ఆన్‌లైన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారు, అలాగే సాధారణ క్యూ లైన్లలో వచ్చిన భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో రద్దీ ఎక్కువైందని అధికారులు వెల్లడించారు.
Atal Bihari Vajpayee’s Death Anniversary : వాజ్‌పేయి జీవితం, సాధించిన విజయాలు
అంతేకాకుండా దేశవ్యాప్తంగా కొత్త ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావడంతో తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. అలిపిరి వద్ద ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడే తక్కువ సమయంలో ఫాస్టాగ్ పొందిన తర్వాత మాత్రమే వాహనాలను తిరుమలకు అనుమతిస్తున్నారు. ఈ విధంగా, భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రిస్తూ, సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.