HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >The Madness Is Over When Will The Auspicious Times Begin

మౌఢ్యమి ముగిసి.. శుభ ముహూర్తాలు ఎప్పటి నుంచంటే!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pelli Muhurtham In 2026
Pelli Muhurtham In 2026

వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా ఉండే వైవాహిక జీవితాన్ని కోరుకుంటారు. ఇందుకు వివాహ ముహూర్తం (Vivah Muhurat 2026) కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. వివాహ ముహూర్తం (Pelli Muhurtham) బాగుంటే వైవాహిక జీవితం కూడా బాగుంటుందనేది పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్ర మౌఢ్యమి తర్వాత పెళ్లి ముహూర్తాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఆయా నెలల్లో ఉన్న పెళ్లి ముహూర్తాల గురించి తెలుసుకుందాం..

హిందూ క్యాలెండర్‌ ప్రకారం మౌఢ్యమి లేదా మూఢమి రోజు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవు అని పండితులు చెబుతారు. ప్రత్యేకించి మూఢం రోజుల్లో శుభకార్యాలు నిర్వహించడం శుభప్రదం కాదని పండితులు చెబుతుంటారు. అయితే ఈసారి శుక్రమౌఢ్యమి కారణంగా గతేడాది అంటే 2025 నవంబర్ 26 శుక్ర మౌడ్యమి (గురుడు, శుక్రుడు అస్తంగత్వం) కారణంగా శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజుతో శుక్ర మౌఢ్యమి ముగియనుంది. దీంతో ఫిబ్రవరి 18 తర్వాత అంటే సుమారు 83 రోజుల తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నామకరణాలు వంటి శుభకార్యాలు పునఃప్రారంభం కానున్నాయి.

వేదాంగ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు వివాహం, గృహ, దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సిరిసంపదలకు ప్రధాన కారక గ్రహం. అయితే ఈ శుక్రుడు సూర్యుడికి అతి సమీపంలో ఉండి అస్తమయ స్థితిలో ఉన్న కాలం అంటే మూఢమి కాలంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, నామకరణాలు వంటి శుభకార్యాలకు అనుకూలత ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 17వ తేదీతో మూఢం ముగిసి.. శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి.. తిరిగి శుభ ఫలితాలు ఇవ్వగల స్థితిలోకి ప్రవేశిస్తాడట. దీంతో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి శుభకార్యాలకు ముహూర్తాలు ప్రారంభంకానున్నాయి.

2026 ఫిబ్రవరి 18 నుంచి శుభ ముహూర్తాలు!

ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి శుభ ముహూర్తాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చు. మే 9వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత అధిక మాసం ప్రారంభమవుతుంది. ఈ అధిక మాసం 2026 మే 17 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో ముహూర్తాలు ఉండవు. శుక్ర మౌఢ్యమి ముగియడం వల్ల శుక్రబలం సైతం బలపడుతుంది.

2026 ఏడాదిలో శుభ ముహూర్తాలు

ఫిబ్రవరి నెల – 19, 20, 21, 24, 25, 26
మార్చి నెల – 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్ నెల – 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే నెల – 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్ నెల – 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై నెల – 1, 6, 7, 11
ఆగస్ట్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో చాతుర్మాస్యం వల్ల శుభ ముహూర్తాలు ఉండవు!
నవంబర్ నెల – 21, 24, 25, 26
డిసెంబర్ నెల – 2, 3, 4, 5, 6, 11, 12

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hindu marriages
  • marriages
  • pelli muhurtham
  • shubha muhuratham
  • Shukra Moudyami
  • Telugu Calendar 2026

Related News

    Latest News

    • Silver Price Today : వెండి కొనుగోలు దారులకు శుభవార్త..ఏకంగా రూ.5వేలు తగ్గిన సిల్వర్ రేటు

    • హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

    • ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

    • Valentine’s Day : ప్రేమికుల రోజును కాస్త ‘కండోమ్స్ డే’ గా మార్చారు కదరా..మీ దుంపతెగ !!

    • Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd