Sunday: ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఆదివారం ఇలా చేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:30 PM, Fri - 18 October 24

వారంలో ఆదివారం రోజు సూర్య భగవానునికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానున్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆదివారం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలట. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అందుకే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి నీటిని సమర్పించాలని చెబుతున్నారు. అదేవిధంగా ఆదివారం రోజు మీ ప్రధాన ముఖ ద్వారం వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు. అలాగే ఆదివారం రోజు ఎక్కడికైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఎర్రచందనం తిలకాన్ని పెట్టుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందట. ఈ విధంగా చేయడం వల్ల చేపట్టిన అన్ని కార్యక్రమాలలో విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు. ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించాలనే నియమం ఉంది.
ఎందుకంటే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలి అనుకున్న వారు ఆదివారం రోజు సూర్య దేవుడికి బెల్లం, పాలు,బియ్యం, ఎరుపు వస్త్రాలను సమర్పించాలని చెబుతున్నారు. ఆ తర్వాత వాటంన్నింటినీ నిస్సహాయకులకు, అలాగే వాటి అవసరము ఉన్నవారికి దానం చేయడం వల్ల అనుకున్న పనులను నెరవేరడంతో పాటు మీ పనుల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే అవి తొలగిపోతాయని చెబుతున్నారు.
వీలైతే ఆదివారం నాడు పవిత్ర నదికి వెళ్లి అందులో బెల్లం, బియ్యం కలిపి ప్రవహించే నదిలో వెయ్యాలట. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఆదివారం రోజు సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవిని ఊహించాలట. ఇద్దరు దేవుళ్ళకు సంబంధించిన మంత్రాన్ని 108 సార్లు జపించాలని, ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ అనుగ్రహంతో పాటు సూర్య భగవానుడు అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు.