TTD: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
- By Balu J Published Date - 05:57 PM, Fri - 20 October 23

TTD: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ, సాయంత్రం నాలుగు గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ జరగనుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు.
Also Read: BRS Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్