HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Srivari Kalyanaratham Leaves For Kumbh Mela From Tirumala

Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

Mahakumbh 2025 : మహా కుంభమేళాలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు

  • By Sudheer Published Date - 11:43 AM, Wed - 8 January 25
  • daily-hunt
Srivari Kalyanaratham Leave
Srivari Kalyanaratham Leave

ప్రతిష్టాత్మక మహా కుంభ మేళా (Maha Kumbh Mela ) 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh )లోని ప్రయాగ్ రాజ్‌(Prayagraj )లో జరగనున్న నేపథ్యంలో తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం (Srivari Kalyanaratham ) బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రథం ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు (Tirumala Tirupati Devasthanams (TTD) Chairman BR Naidu ), అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి రథానికి పచ్చ జెండా ఊపారు.

Chilli Powder : హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం..సీఎం మాత్రం ఒక ప్లేట్‌ రూ. 32,000 భోజనం – KTR

మహా కుంభమేళాలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. సెక్టార్ 6లోని భజరంగ్ దాస్ రోడ్డులో నాగ వాసుకి దేవాలయం సమీపంలో ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. తిరుమల తరహాలోనే ఈ నమూనా ఆలయంలో అన్ని కైంకర్యాలు 170 మంది సిబ్బందితో నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. కుంభమేళా కాలంలో నాలుగు సార్లు శ్రీవారి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 18, 26తో పాటు ఫిబ్రవరి 3, 12 తేదీల్లో భక్తులకు ఈ పవిత్ర కైంకర్యాలను తిలకించే అవకాశం కల్పించనున్నారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే ప్రత్యేక అవకాశం లభించనున్నదని చైర్మన్ పేర్కొన్నారు.

అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం అయిన కుంభమేళాలో భాగంగా వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ మహా ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్లు శ్రీ రామకృష్ణ, శ్రీ మునిరత్నం తదితర అధికారులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chairman BR Naidu
  • Mahakumbh 2025
  • prayagraj
  • Srivari Kalyanaratham
  • Uttar pradesh

Related News

Murder

Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.

  • Crime

    Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd