Chilli Powder : హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం..సీఎం మాత్రం ఒక ప్లేట్ రూ. 32,000 భోజనం – KTR
Chilli Powder : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది
- By Sudheer Published Date - 11:29 AM, Wed - 8 January 25

నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) హాస్టల్‌లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌లో గొడ్డు కారం అన్నం (Chilli Powder, Salt) అందించడంపై పెద్ద దుమారం రేగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనానికి (CM Plate for Lunch) రూ. 32,000 ఖర్చు చేస్తుంటే, విద్యార్థులకు మాత్రం గొడ్డు కారం అన్నం పెడతారా అని ప్రశ్నించారు.
హాస్టల్‌లో విద్యార్థులకు అల్పాహారంగా అన్నం, గొడ్డు కారం అందజేయడం పట్ల విద్యార్థులు , తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేట్లతో క్యూలో ఉన్న విద్యార్థులు, పక్కనే ఉప్పు డబ్బా, గొడ్డు కారం ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై వివిధ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. హాస్టల్‌లో సరైన భోజన వసతులు లేకపోవడం, నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైరల్ వీడియోల తరువాత హాస్టల్ నిర్వాహకులు విద్యార్థుల నుంచి లేఖను విడుదల చేయించారు. అందులో విద్యార్థినులు స్వయంగా గొడ్డు కారం అడిగారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యార్థుల భోజన ప్రమాణాలు, హాస్టల్ వసతులపై విఫలమైన ఈ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది ప్రజలపై జరుగు నిర్లక్ష్యం అని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఉన్నదంతా మాయమని పేర్కొన్నారు.
Read Also : Ram Charan : బాలీవుడ్ లో ఆ సినిమా చేసినందుకు రామ్ చరణ్ బాధపడ్డాడట..