Aashta Mahadanalu: అష్ట మహాదానాలు అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్?
అష్ట మహాదానాలు అంటే నువ్వులు, బంగారం, ఇనుము,పత్తి,ఉప్పు, భూమి, గోవు వాటిని అష్టమహాదానాలు అని అంటారు.
- By Anshu Published Date - 07:30 AM, Thu - 1 September 22
 
                        అష్ట మహాదానాలు అంటే నువ్వులు, బంగారం, ఇనుము,పత్తి,ఉప్పు, భూమి, గోవు వాటిని అష్టమహాదానాలు అని అంటారు. అయితే వీటిని దానం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నువ్వులు.. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. కాగా నువ్వుల్లో మూడు రకాలు నువ్వులు ఉన్నాయి. ఈ మూడింటిలో దేనిని దానం చేసినా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
అదేవిధంగా ఇనుమును దానం చేయడం వల్ల యమలోకానికి వెళ్లకుండా ఉండవచ్చు అని శాస్త్రం తెలుపుతోంది. ఇందుకు గల కారణం యముడు ఇనుముతో తయారు చేసినటువంటి ఆయుధాలను ధరించి ఉంటాడు. కాబట్టి ఇనుమును దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. బంగారం లేదా సువర్ణ దానం బ్రహ్మ,మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. అలాగే పత్తిని దానం చేయడం వల్ల యమ భటుల భయం ఉండదు. ఇక ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడట.
తద్వారా చావు భయం కూడా ఉండదు. అలాగే భూమిని ధానం చేయడం వల్ల సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. అలాగే సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. అలాగే గోదానం అనగా గోవుని దానం చేయడం వల్ల వైతరిణి నదిని సులభంగా దాటిపోవచ్చు. అలాగే ఏడు రకాల ధాన్యాలు అనగా గోధుమలు, కందులు,పెసలు,శనగలు,బొబ్బర్లు, మినుములు, ఉలవలు దానం చేయడం వల్ల యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు.