Vastu : తలస్నానం చేసిన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదా? పెట్టుకుంటే అరిష్టమా..?
- By hashtagu Published Date - 07:11 AM, Mon - 21 November 22
తెలిసి…తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయడం మానవ లక్షణం. అయితే వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్నితప్పులు తెలియకుండానే చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మనం జీవితంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి మనం ప్రతిరోజూ చేసే కొన్ని వాస్తుదోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు విషయంలో బాధ్యతారహితంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రతికూలతను తీసుకువస్తాయి. వాటిని వదిలించుకునేందుకు వాస్తు చిట్కాలను అనుసరించాలి.
1. స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. స్నానం చేసి తర్వాత చేతి గోర్లు తీయడం, బ్లేడు లేదంటే రేజర్లు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేస్తే జీవితంలో ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తుంది.
2. చాలామంది బాత్ రూమ్స్ లో బట్టలు ఉతికి ఆ నీళ్లను బకెట్లో అలాగే వదిలేస్తారు. వాస్తు ప్రకారం అలా చేయకూడదు. మురికి నీటిని బకెట్లో ఉంచితే అరిష్టం. ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, మనశ్శాంతి కరువు అవుతుంది.
3. వాస్తు ప్రకారం బాత్ రూంలో బకెట్ ను ఖాళీగా ఉంచకూడదు. బకెట్ లో కానీ టబ్ లో ఎప్పుడూ నీరు ఉంచాలి. లేదంటే తలక్రిందులుగా ఉంచాలి.
4. వివాహిత మహిళలు తలస్నానం చేసిన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేస్తే…స్త్రీలపై చెడు ప్రమాదం ఉంటుంది. చెడు ఆలోచనలు వారిలోకి ప్రవేశిస్తాయి. ఇంట్లో శాంతి సంతోషాలకు నష్టం వాటిల్లుతుంది. కుటుంబ కలహాలు ఎక్కువఅవుతాయి.
5. స్నానం చేసిన తర్వాత బాత్ రూమ్ ను శుభ్రం చేయాలి. బాత్ రూం ఫ్లోర్ ఎప్పుడూ తడిగా ఉండకూడదు. ఇలా ఉంచడం వల్ల ఆర్థిక పరిమితులు ఇంటి చుట్టూ ఉన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.