Sri Krishna: మరణానికి దుఃఖించకూడదు.. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఎందుకు ఇలా అన్నాడో తెలుసా..?
- By Gopichand Published Date - 07:00 AM, Sat - 22 June 24

Sri Krishna: హిందూ మతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు (Sri Krishna) సనాతన సంస్కృతికి జీవనాధారమని అంటారు. వీరిద్దరూ మానవ కళ్యాణం కోసమే జన్మించారని నేటి ప్రజల నమ్మకం. ప్రస్తుతం మనం శ్రీ కృష్ణ భగవానుడి గీత గురించి మాట్లాడుకుందాం. ఇందులో అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేసి విజయాన్ని అందించాడు. మహాభారత కాలంలో కురుక్షేత్రంలో అర్జునుడికి భగవంతుడు శ్రీ కృష్ణుడు స్వయంగా విలువైన బోధనలు ఇచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు కౌరవులతో యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు మనం ఓ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఎవరి మరణానికి దుఃఖించకూడదని శ్రీ కృష్ణుడు అర్జునుడికి సూచించాడో పూర్తి కారణాన్ని తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు అర్జునుడికి మరణ సత్యాన్ని చెప్పాడు
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి||
అర్థం
హి = ఎందుకంటే ; జాతస్య = పుట్టినవాడికి ; మృత్యుః = మరణం ; ధ్రువః = నిశ్చయం ; చ = అంతేకాక ; మృతస్య = మరణించినవానికి ; జన్మ = పుట్టుక ; ధ్రువం = తప్పదు ; తస్మాత్ = అందువల్ల ; అపరిహార్యే = తప్పించ వీలుకాని; అర్థే = విషయంలో ; త్వం = నువ్వు ; శోచితుం = శోకించడానికి ; న అర్హసి = అర్హుడవు కావు
Also Read: Seethakka: రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు: మంత్రి సీతక్క
శ్రీ కృష్ణుడు అర్జునుడికి చావు ఖాయమని.. పుట్టిన ఏ ప్రాణికైనా చనిపోవడం సహజం, చనిపోతే పుట్టడం ఖాయం అని చెప్పారు. దీని గురించి ఎవరూ దుఃఖించకూడదు. మనిషి తన కర్మల ప్రకారం జన్మ తీసుకుంటాడు. అతని కర్మలను అనుభవించిన తరువాత, అతని కాలం పూర్తయిన తర్వాత అతని మరణం ఖచ్చితంగా ఉంటుంది. మార్పులేని సత్యమైన విషయాన్ని అంగీకరించాలి. దాని గురించి బాధపడకూడదని బోధించాడు. (“పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు”).
అర్జునుడి దుఃఖం కారణంగా శ్రీ కృష్ణుడు ఈ సలహా ఇచ్చాడు
మహాభారత యుద్ధభూమిలో అర్జునుడు తన ప్రియమైన వారిని చాలా మందిని కోల్పోయాడు. దాని కారణంగా అతను విచారంగా ఉంటాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఈ హత్తుకునే విషయాన్ని వివరించాడు. అతనికి మార్గనిర్దేశం చేశాడు.
We’re now on WhatsApp : Click to Join